సింగరేణిపై నేతల దృష్టి

Focus on the singer

Focus on the singer

Date:12/10/2018
మంచిర్యాల  ముచ్చట్లు:
డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో సింగరేణి కార్మికులది కీలక పాత్ర కానుంది. వారు న్యాయనిర్ణేతలుగా నిలుస్తారనడంలే అతిశయోక్తి లేదని పలువురు అంటున్నారు. ఎన్నికల్లో కోల్ బెల్ట్ ఓటర్ల తీర్పు అన్ని ప్రధాన పార్టీలకు కీలకం కానుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలన్నీ సింగరేణి కార్మికులపై దృష్టి సారించాయి. కార్మికులను ఆకట్టుకునేందుకు వ్యూహాలు ముమ్మరం చేశాయి. సింగరేణిలో దాదాపు 65వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. కార్మిక కుటుంబాల ఓట్లు దాదాపు రెండున్నర లక్షలు ఉంటాయని అంచనా. వీరితో పాటు 20వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు, 30వేల మంది రిటైర్డ్ కార్మికుల కుటుంబాల ఓట్లు ఉంటాయని టాక్. సింగరేణిపై పరోక్షంగా ఆధారపడి జీవించే ఓటర్లు మరో రెండు లక్షల మంది వరకు ఉంటారు.
మొత్తంగా తెలంగాణలోని 6 జిల్లాలో ఉన్న సింగరేణి కార్మికులు వారి కుటుంబాల ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు కాగానే నేతల దృష్టి ఓటు బ్యాంకుపై పడింది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కీలక ఓటు బ్యాంక్ అయిన సింగరేణి కార్మికులనూ ప్రసన్నం చేసుకునే కార్యక్రమానికి తెరతీశారు. వాస్తవానికి సింగరేణి ఓట్ పరిమాణం ఎక్కువే. ఎన్నికలు ఏదైనా ఈ సంస్థ కార్మికులు ప్రభావం చూపుతారనడంలో సందేహంలేదు.
సింగరేణి గనులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో నాయకుల భవితను ప్రభావితం చేయగల సత్తా వీరికి ఉంది. అందుకే కార్మికులను తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సింగరేణి సమస్యల్ని పరిష్కరించి కార్మికులకు అండగా ఉంటామంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నాయి. ఇదిలాఉంట్ అన్ని రాజకీయ పార్టీలకు సింగరేణిలో అనుబంధ కార్మిక సంఘాలున్నాయి. దీంతో వాటి ఉనికి కోసం గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలవడం కోసమైనా మేనిఫెస్టోల్లో సింగరేణి సమస్యలు చేర్చేలా నేతలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Tags:Focus on the singer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *