సోషల్ మీడియా వింగ్ పై దృష్టి

హైదరాబాద్ ముచ్చట్లు:


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ గా కొనసాగుతున్న సతీష్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా వై.సతీష్ రెడ్డిని నియమించారు. అలాగే టీఆర్ఎస్ ఎన్నారై సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్న అనిల్ కూర్మాచలంను తెలంగాణ స్టేట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరిద్దరూ తమ పదవుల్లో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్‌గా కొన‌సాగుతున్న స‌తీష్ రెడ్డి.. ఇటీవల బీజేపీ విధానాలను సామాజిక మాధ్యమాల్లో బలంగా తిప్పికొడుతున్నాడు. కేసీఆర్ రాజకీయ విధానాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తున్నాడు. అయితే రానున్న ఎన్నికల్లో బీజేపీ తరహాలో సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ పై ఆయన దృష్టి సారించారని, ఇక్కడ చురుకుగా పనిచేస్తే రాబోయే రోజుల్లో పార్టీ మిమ్నల్ని గుర్తిస్తుందనే సంకేతాలు ఇవ్వడానికే తాజాగా సతీష్ రెడ్డికి పదవి కట్టబెట్టారనే మాట వినిపిస్తోంది. త్వరలో కేసీఆర్ ప్రకటించబోయే బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచనలు చేశారని అందులో భాగంగానే పార్టీ శ్రేణుల్లో సోషల్ మీడియా విభాగం పట్ల మరింత ఆసక్తి పెంపొందించేలా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

Tags: Focus on the social media wing

Post Midle
Post Midle
Natyam ad