Focusing center

కక్షపూరితంగా కేంద్రం

-టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు
Date:08/11/2018
అమరావతి ముచ్చట్లు:
కేంద్ర పాలకుల్లో తీవ్ర అసహనం పెరిగిపోయిందని, ప్రత్యర్థులపై కక్ష సాధింపునకు ఐటీ, ఈడీ దాడులను ఉపయోగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.  గురువారం నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని, రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని అన్నారు. సీబీఐ, ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీశారని, ఈ పరిస్థితుల్లో దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని చంద్రబాబు అన్నారు.
తిత్లీ  తుపాను సహాయ చర్యల్లో తొలిరోజు ఇబ్బంది పడ్డామని, 25రోజుల్లో పరిహారంతో సహా అంతా చక్కదిద్దామన్నారు. కేంద్రం నుంచి సాయం లేదని, మన వనరులతోనే ఆదుకున్నామని, అధికారుల అందుబాటు వల్ల ప్రజల భాగస్వామ్యం పెరిగిందని, 10,169 గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. అధికారులు అందుబాటులో ఉండడంతో ప్రజల భాగస్వామ్యం కూడా పెరిగి మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. నాలుగున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని గోడ రాతల ద్వారా ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు.
Tags: Focusing center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *