పట్టణంలో దోమలు నివారించేందుకే ఫాగింగ్‌

Fogging just to prevent mosquitoes in town

Fogging just to prevent mosquitoes in town

Date:16/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలకు దోమలు ప్రభలడంతో పగటిపూట ఫాగింగ్‌ చేపట్టినట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. బుధవారం పట్టణంలోని ఎంబిటి రోడ్డు, కొత్తపేట, ఉబేదుల్లా కాంపౌండు, ఈస్ట్పేట ప్రాంతాలలో ఫాగింగ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణంలో నీటి నిల్వలను తొలగించి, లార్వాలను నివారిస్తున్నామన్నారు. దోమలు ప్రభలడంతో జ్వరాలు తీవ్రమౌతున్నందున నివారణ చర్యలు చేపట్టామన్నారు. పట్టణంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని, నీటి నిల్వలు లేకుండ చూసుకోవాలన్నారు. అలాగే మంచినీటిని కాచి , వడపోసి తాగాలని సూచించారు. వార్డు వలంటీర్లచే ప్రతి ఇంటా పారిశుద్ధ్య కార్యక్రమాలపై కరపత్రాలను పంపిణీ చేసి, చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ , మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

గ్రామ సభల్లో అర్హులుగా గుర్తించిన వారికి ఇండ్లు

Tags: Fogging just to prevent mosquitoes in town

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *