Natyam ad

రహదారి భద్రతలను పాటించండి -సీఐ రాఘవరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

ప్రతి ఒక్కరు రహదారి నిబంధనలను పాటించి ప్రమాదాలు జరగకుండ జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ రాఘవరెడ్డి సూచించారు. మంగళవారం ఆర్టీసి డిపోలో మేనేజర్‌ సుధాకరయ్య , ఆర్టీసి మజ్ధూర్‌ సంఘ అధ్యక్షుడు జయరామిరెడ్డి తో కలసి రోడ్డు భద్రత మసోత్సవాలను నిర్వహించారు. వేగంగా నడపడం, ఓవర్‌టేక్‌ చేయడం ప్రమాదకరమన్నారు. అలాగే ప్రయాణికులు ఎక్కే సమయంలో దిగే సమయంలో బండిని పూర్తిగా ఆపివే సి ప్రయాణికులకు ప్రమాదాలు జరగకుండ జాగ్రత్తలు వహించాలన్నారు. అలాగే మైనర్లకు ద్విచక్రవాహనాలను ఇవ్వరాదన్నారు. లైసెన్సులు, తగిన రికార్డులు ఉన్న వాహనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, అలాంటి వాటినే రహదారులలో వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి ఉద్యోగులు, డ్రైవర్లు, కండెక్టర్లు పాల్గొన్నారు.

Post Midle

Tags: Follow road safety -CI Raghavareddy

Post Midle