రాజ్యాంగాన్ని అనుసరించి తీర్పును స్వాగతిస్తాం

Following the Constitution we will welcome judgment

Following the Constitution we will welcome judgment

– కానీ అది వేరొకరి మనోభావాలు దెబ్బతీసేలా ఉండకూడదు
– శబరిమల తీర్పు కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించింది
– తీర్పు అవసరంపై చర్చించి ఉంటే బావుండేది :రివ్యూ పిటిషన్‌ దారులు
Date:10/10/2018
తిరువనంతపురం  ముచ్చట్లు:
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించిన నేపద్యం లో జాతీయ అయ్యప్పస్వామి భక్తుల(మహిళలు) సంఘం సభ్యులు స్పందించారు. దిల్లీలోని ఎన్జీవో సంస్థ సభ్యులు మాట్లాడుతూ…‘ కోట్లాది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమిది. దేవాలయానికి ఈ తీర్పు అవసరమా లేదా అని చర్చించుకుని సుప్రీం ఈ తీర్పు ఇచ్చి ఉంటే బాగుండేది. ఆలయ గుర్తింపునకు ఇది ఎంతమాత్రం ఉపయోగపడుతుందో ఆలోచించుకుని న్యాయం చెప్పాలి. ఈ తీర్పు అవసరం లేదనుకుంటే ప్రస్తుతం ఆలయంలో కొనసాగుతున్న సంప్రదాయాలను అలాగే కొనసాగనివ్వాలి. రాజ్యాంగాన్ని అనుసరించి తీర్పు చెప్పడం ముఖ్యమే.
కానీ అది వేరొకరి మనోభావాలు దెబ్బతీసేలా ఉండకూడదు. మతాచారాలను దుర్వినియోగం చేసేలా ఉండకూడదు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ పవిత్రత ఏపాటిదో దాదాపు దేశంలోని అందరి మహిళలకు తెలుసు. అలాంటప్పుడు సుప్రీం తీర్పుపై పునర్విచారణ జరపడానికి ఇబ్బందేముంది. సుప్రీం దీనిపై మళ్లీ విచారణ జరిపేలోపే ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. ఇంత అయోమయంలో తీర్పు ఉంటే మహిళలు ఎలా వెళ్లగలరు?’ అని ప్రశ్నించారు.రివ్యూ పిటిషన్లు విచారణ జరిపే ధర్మాసనం ఆ పిటిషన్‌ను‌ సమయం వచ్చినప్పుడే విచారణ చేపడుతుందని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. దసరా సెలవులకు ముందు ఈ పిటిషన్‌ విచారణకు రాదని, సెలవుల అనంతరం అక్టోబరు 22న కోర్టు తిరిగి ప్రారంభమవుతుందని వెల్లడించారు.
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళ ప్రవేశంపై నిషేధం ఎత్తేస్తూ తీర్పు ఇచ్చిన అనంతరం శబరిమల ఆలయాన్ని నెలవారీ పూజల కోసం తొలిసారిగా అక్టోబరు 16న తెరవనున్నారు. అయితే మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని ఓ భక్తుల బృందం హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆలయ పరిసరాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీం కోర్టు మంగళవారం నిరాకరించిన విషయం తెలిసిందే. దసరా సెలవుల తర్వాతే దీనిపై విచారణ జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. అయితే దీనిపై పిటిషన్‌దారులు స్పందించారు.
Tags:Following the Constitution we will welcome judgment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed