ఆగస్టు 1 నుంచి సినిమా హాల్స్ లోకి ఫుడ్ ఐటెమ్స్

Food items into movie halls from August 1

Food items into movie halls from August 1

 DAte:13/07/2018
ముంబై ముచ్చట్లు:
సరదాగా గడుపుదామని సినిమా చూడటానికి వెళ్తే పార్కింగ్ ఫీజులతో మొదలుపెట్టి ఫుడ్ ఐటెమ్స్ వరకూ అధిక మొత్తం వసూలు చేస్తూ వినియోగదారుల నుంచి డబ్బులు పిండుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా సాగుతున్న వసూళ్లను అడ్డుకునేవారే లేరా అనేది సగటు పౌరుడి ప్రశ్న. ఈ దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ముందడుగేసింది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా చూడటానికి వెళ్లేవాళ్లు తమ వెంట ఆహార పదార్థాలను తీసుకొని వెళ్లొచ్చని స్పష్టం చేసింది. తద్వారా థియేటర్లలో విక్రయించే ఫుడ్ ఐటెమ్స్ రేట్లలో గణనీయ తగ్గుదల కనిపించే అవకాశాలున్నాయి. ఆగస్టు 1 నుంచి అన్ని రకాల సినిమా హాళ్లు ఈ నిబంధనను పాటించాలని సూచించింది. ఒకవేళ సినిమా థియేటర్లు ఈ నిబంధనను పాటించకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైనా మహారాష్ట్ర ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించాలనే యోచనలో ఉంది. ఈ వివరాలను ఆ రాష్ట్ర ఆహార శాఖ మంత్రి రవీంద్ర చావన్ మీడియాకు తెలిపారు. ఫుడ్ ఐటమ్స్‌తో సినిమాకు వెళ్తున్నవారిని ఇకపై ఎవరైనా అడ్డుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఒకే ఉత్పత్తి (ప్రొడక్ట్)కి వేర్వేరు రేట్లు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో చాలా కాలంగా ఆహార పదార్థాలను అధిక ధరలకు అమ్ముతున్నారు. దీనికి వ్యతిరేకంగా మహారాష్ట్రలో తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. ఈ అంశంపై ఇటీవల పుణేలో ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు ఓ థియేటర్ మేనేజర్‌పై దాడి చేసి చితకబాదారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయమే తీసుకోవాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.
ఆగస్టు 1 నుంచి సినిమా హాల్స్ లోకి ఫుడ్ ఐటెమ్స్  https://www.telugumuchatlu.com/food-items-into-movie-halls-from-august-1/
Tags:Food items into movie halls from August 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *