ప్రజలకు ఆహార భద్రత అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు

-టిడిపి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వెల్లడి

 

అల్లూరి ముచ్చట్లు:

ప్రజలకు ఆహార భద్రత అనేది రాజ్యాంగ బద్దంగా సిద్ధించిన హక్కు. దశాబ్దాలుగా అమలవుతున్న ఆహార భద్రత కార్యక్రమాలకు గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో తిలోదకాలివ్వడం బాధాకరమని పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పాడేరు తాసిల్దార్ వారికి ఆహార భద్రత సక్రమంగా అమలు చేయాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూనిత్యావసర వస్తువల ధరలపై నియంత్రణ కొరవడిందని,రేషన్ షాపుల్లో ఇచ్చే సరుకుల్లో నాణ్యతా అంతంత మాత్రంగానే ఉంటోందన్నారు. కందిపప్పు, పంచధార ధరల్ని అమాంతం పెంచేయడంతో కార్డు దారులకు అధనపుభారం మోపారన్నారు.

 

 

 

మండల వ్యాప్తంగా వందలాది రేషన్ కార్డులు రద్దయ్యాయని, కరోనా సమయంలో ప్రకటించిన పి ఎం జి కె ఏ వై  పథకం కింద అందించాల్సిన ఉచిత బియ్యం పథకాన్ని గత నాలుగు నెలలుగా నిలిపివేశారన్నారు. ఇప్పుడు అమలు చేస్తున్నప్పటికీ కొందరికి మాత్రమే ఇస్తున్నారని,ఈ నిర్ణయం ఆహార భద్రత చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు.2019కి ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయంలో రేషన్ షాపుల్లో రూ.1కి – కిలో బియ్యం, రూ.40కి కిలో చొప్పున – రెండు కిలోల కందిపప్పు, రూ.10కి – అరకిలో పంచదార, రు.16.50కి- కిలో గోధుమపిండి, రూ.12 కి – అయోడైజ్డ్ సాల్ట్ సహా కిలో రూ.1 చొప్పున జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలు, మహిళలకు సబ్సిడీతో శానిటరీ పాడ్స్ వంటి సుమారు 8 రకాల వస్తువులు అందించడమైందన్నారు.

 

 

 

ఇదే సమయంలో  సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు రూ.500 కోట్ల వ్యయంతో పండుగ కానుకలను రాష్ట్రంలోని 1.47 కోట్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా అందించడం జరిగిందన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రేషన్ వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేశారన్నారు. కార్డు దారులకు బియ్యం, పంచదార, కందిపప్పు మాత్రమే అందిస్తున్నారని,అన్ని సంక్షేమ పధకాలకు రేషన్ కార్డులే ప్రామాణికంగా చేసిన జగన్ ప్రభుత్వం రకరకాల కారణాలు చూపించి రాష్ట్రంలో సుమారు 18.72 లక్షల రేషన్ కార్డులని తొలగించారన్నారు.కరోనాతో ఎదురైన ఇబ్బందులు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకుపి ఎం జె కె వై పథకం కింద రేషన్ ఉచితంగా అందించడం జరిగిందన్నారు. ఆ పథకాన్ని ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు పొడిగించడం జరిగిందని, దేశంలోని అన్ని రాష్ట్రాలు ఉచిత బియ్యం పథకాన్ని ఆయా  రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఆహార పద్ధతులకు పెద్దపీట వేశారన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 4 నెలలుగా ఈ పథకాన్ని నిలిపివేశారన్నారు.  తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం ఇవ్వకుండా ఆహార భద్రత చట్టాన్ని ఉల్లఘిస్తున్నారన్నారు.

 

 

ఇది చట్టరీత్యా నేరం. తెల్ల రేషన్ కార్డులోని సభ్యులకు ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల చొప్పున 4 నెలలకు 20 కిలోల బియ్యం అలాగే ఆగస్టు 5 కిలోల బియ్యం మొత్తం 25 కిలోల బియ్యం  పంపిణీ చేయాల్సి ఉన్నా, ప్రభుత్వం పట్టించుకోవడం చాలా విడ్డూరంగా ఉందని ఆమె ఎదవ చేశారు. ఫలితంగా గత  4 నెలల్లో ఒక్కో సభ్యుడు 700 రూపాయలు (20 కిలోలు x రూ.35) నష్టపోయారని,రాష్ట్రంలో 1.47 కోట్లు కార్డులోని 4.20 కోట్ల మంది సభ్యులు 4 నెలల కాలానికి 2,940 కోట్లు విలువగల ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత కారణంగా నష్టపోయారన్నారు. రాష్ట్రంలోని మొత్తం 1.47 కోట్ల తెల్ల రేషన్ కార్డుదారులు అందరికీ అసమానతలు లేకుండా ఏప్రిల్, మే, జూన్, జూలై నెల రేషన్ 20 కేజీలు + 5 కేజీలు ఆగస్టులో మొత్తం 25 కేజీలు రేషన్ వెంటనే 1.47 కోట్ల తెల్ల రేషన్ కార్డుదారులు అందరికీ అందించాలన్నారు.తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ సాధారణంగా ఇచ్చే బియ్యంతో పాటు, ఉచిత బియ్యాన్ని కూడా అందించాలని,ఇంటి ముందుకే రేషన్ బియ్యం పేరుతో ప్రారంభించిన ఎం డి యు  వాహనాల ఆపరేటర్లు, వీధి చివర్లో/ఏదైనా సెంటర్లో వాహనం ఆపి బియ్యం పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ పద్దతిని సమీక్షించి ఇళ్ల వద్దకు తెచ్చి ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని అమలు చేయాలని, రేషన్ వ్యవస్థ ద్వారా ఇవ్వాల్సిన సరుకుల సంఖ్యను కూడా కుదించి బియ్యానికి మాత్రమే పరితం చేశారన్నారు. ఇది ఆహార భద్రత చట్టాన్ని తుంగలో తొక్కడమే అవుతుందన్నారు. బియ్యంతో పాటు కందిపప్పు, పంచధార సహా చిరుధాన్యాలు, గోధుమ పిండి వంటి గతంలో అమలైన అన్ని రకాల సరుకుల్ని కూడా రేషన్ వ్యవస్థలో కొనసాగించాలన్నారు.

 

Tags: Food security for the people is a constitutional right

Leave A Reply

Your email address will not be published.