Natyam ad

 సుస్థిరమైన రేపటి కోసం…లింగ సమానత్వం

-సృష్టికి ప్రతిసృష్టి మహిళ….”మేయర్ గుండు సుధారాణి”
-అంతర్జాతీయ మహిళా దినోత్సవం  సందర్భంగా కెఎంసి నుండి జిడబ్లుఎంసి వరకు కాన్సర్ అవగాహణపై మహిళలతో భారీ ర్యాలీ
-మహిళ కార్పొరేటర్లు, ఉత్తమ బ్యాంకర్లకు, బల్దియా మెప్మా ఆర్పీలకు, పారిశుద్ధ్య సిబ్బందికి ఘన  సత్కారం
వరంగల్ ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లింగ వివక్ష రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు వినూత్న రీతిలో అనేక మహిళాభివృద్ది, సంక్షేమ, సంరక్షణ
పథకాలకు రూపకల్పన చేశారని వరంగల్ మహా నగర పాలక మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిడబ్ల్యూఎంసి, ఒమేగా బన్ను ఆసుపత్రి, ఇండియన్ రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో కాకతీయమెడికల్ కళాశాల నుండి  మహా నగర పాలక సంస్థ వరకు కాన్సర్ పై  అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన ర్యాలీని మేయర్ గుండు సుధారాణి కమిషనర్ పి.ప్రావీణ్య, డిసిపి పుష్పా, ఒమేగా బన్నుఆసుపత్రి యం.డి చరంజిత్ రెడ్డి, ఐఆర్సి, ఈ వి శ్రీనివాస్ లతో కలసి జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు క్యాన్సర్ వ్యాధిపై  పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. కాకతీయ మెడికల్ కళాశాలనుండి బల్దియా, ఒమేగా ఆసుపత్రి అధికారులు, సిబ్బంది లతో ప్ల కార్డులు చేతబూని కాన్సర్ పై అవగాహన కల్పిస్తూ కొనసాగిన ర్యాలీ ఎంజీఎం చౌరస్తా వద్ద పెద్దఎత్తున మానవాహారం నిర్వహించారు. ఈసందర్భంగా బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ ఒమేగా బన్ను ఆసుపత్రి వారు ముందుకు వచ్చి కాన్సర్ పై ర్యాలీలో భాగస్వాములు కావడంఅభినందనీయమన్నారు.   మహిళ శక్తి స్వరూపినని, స్త్రీ ఆదిశక్తి అని, సృష్టికి ప్రతి సృష్టి నిచ్చి సమాజానికి మార్గ నిర్దేశనం చేసే మహిళ తనకు తానే సాటి అని మేయర్ కొనియాడారు.
మహిళలు భౌతికంగా,మానసికంగా ఆరోగ్య వంతంగా ఉన్నపుడే అన్ని రంగాల్లో రాణించ గలరని తెలిపారు. ఫిబ్రవరి 28, 1909న
న్యూజిలాండ్‌లో  సార్వత్రిక మహిళా ఓటు హక్కు ఉద్యమం ద్వారా ప్రారంభమై 1977లో ఐక్యరాజ్య సమితి ఆమోదం పొందిన ఈ రోజును ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా  జరుపుకొంటామన్నారు.ఈ సంవత్సరం అంశం“సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం”..అని స్పష్టం చేశారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తెలంగాణలో మహిళా బంధు పేరుతో మార్చి 6,7, 8తేదీలలో చేసుకోవడం మహిళల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి, భద్రత , పోషణ కార్యక్రమాలకు వారికి కృతజ్ఞతతో ఈ రాష్ట్ర మహిళలు ఇస్తున్న ఒక కానుక అనితెలిపారు.మహిళలకు సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తూనే వారి భద్రతకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇందుకోసం షి టీమ్స్, భరోసా కేంద్రాలు, సఖి సెంటర్లు పెట్టి మహిళలకు  ప్రభుత్వంరక్షణ కవచంగా నిలుస్తోందన్నారు. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో గర్భిణులకు పౌష్టిక ఆహారం అందజేయడానికి అధిక నిధులు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా మేయర్ ధన్యవాదాలు
తెలిపారు. మారుతున్న కాలనికి అనుకూలంగా మహిళలు చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజంలో సగభాగమైన మహిళలు సమానత్వం కోసం మగవారితో పోటిపడాలని, ప్రభుత్వంఅందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను అందిపుచ్చుకొని మరింత ఆర్థికంగా ఎదగాలని సూచించారు. గతంలో మహిళ సంఘాలలో సభ్యత్వం కొరకు మహిళలు ముందుకు రాలేక పోయేవారని, కానీ వారినిప్రోత్సహించడం వల్ల నేడు ఉద్యమంలా ప్రతి ఇంటి నుండి ఒక మహిళ ఎస్ హెచ్ జి లో సభ్యులుగా ఉన్నారన్న మేయర్ అది వారి చైతన్యానికి నిదర్శనమన్నారు. గ్రేటర్ కమిషనర్ మాట్లాడుతూ  మహిళలు
ఫిట్ నెస్, ఆరోగ్యంపై  ప్రత్యేక శ్రద్ధ చూపినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని, సమాజ అభివృద్ధిలో స్త్రీ పాత్ర ఎంతో గొప్పదని, జిల్లాలోని అన్ని శాఖల కన్నా బల్దియా లోనే ఎక్కువ మంది మహిళాఉద్యోగులు విధులు నిర్వహించడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. డిసిపి వెంకట లక్ష్మి మాట్లాడుతూ  ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని, మహిళలు అన్ని రంగాల్లో ముందువరుసలో ఉన్నారని, క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం వల్ల నయం చేయవచ్చునని తెలిపారు. డిసిపి పుష్ప మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో మగవారికి తీసిపోని విధంగా రాణిస్తున్నారని,  కమిషనరేట్ పరిధిలో “నయీ కిరణ్” అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఎవరైనా మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారితేతమకు సమాచారాన్ని అందజేయాలని, సమాచారం అందజేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ చూపిన బ్యాంకర్లకు, పారిశుధ్య సిబ్బంది, మెప్మా ఆర్పీ లకు, సిబ్బందిని మేయర్,కమీషనర్ లు శాలువాలతో సన్మానించి ప్రసంశపత్రాలను అందజేశారు.     ఈ కార్యక్రమంలోకార్పొరేటర్లు దేవరకొండ విజయ లక్ష్మి, జన్ను షీభారాణి అనిల్, చీకటి శారద, ఈదురు అరుణ, గుండు చందన, బైరి లక్ష్మీ, గుగ్గిళ్ల వసంత, రావుల కోమల, సుంకరి మనీషా, ఆవాల రాధిక రెడ్డి, మనసారాంప్రసాద్, ఇమ్మడి లోహిత, తూర్పాటి సులోచన, గుంటి రజిత, జక్కుల రజిత, గుగులోతు దివ్యరాణి, అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్, సిఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, సిహెచ్ఓ సునీత, సెక్రెటరీవిజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ లు జోనా, రవీందర్ యాదవ్, వింగ్ అధికారులు, మెప్మా, బల్దియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 
Tags:For a sustainable tomorrow … gender equality

Leave A Reply

Your email address will not be published.