Natyam ad

కళ్యాణ కానుక, షాది తోఫా మొదటి నుంచి అమలు చేయాలి

కడప ముచ్చట్లు:

స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ ఏ. సత్తార్  ఆధ్వర్యంలో ఎన్ ఎస్ యుఐ  నాయకుడు తిరుమలేష్ అధ్యక్షతన ” కళ్యాణ కానుక, షాది తోఫా వైఎస్ ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అమలు చేయాలి” అనే డిమాండుతో కాంగ్రెస్ పార్టీ” ధర్నా” కార్యక్రమం కలెక్టరేట్ ఎదుట జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, ఏఐసీసీ మెంబరు బండి జకరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ ఏ సత్తార్ లు మాట్లాడుతూ  ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పలు విడతలకు పాదయాత్ర చేస్తూ ఆ సందర్భంలో పలు రకాల వాగ్దానాలు చేశాడు. అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ  మైనారిటీలు, వికలాంగులు అయిన ఆడపిల్లల వివాహ సందర్భంలో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు తక్కువగా ఇస్తోంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతకురెట్టింపుగా ఇస్తానని వాగ్దానం చేశాడు. పాపం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు  ఆశపడి నమ్మి గంపగుత్తగా ఓట్లు వేసేశారు. భారీ మెజారిటీతో గెలిపించారు. ఆశపడిన ఆ వర్గాల వారికి ఆశ నిరాశ అయ్యింది. అన్ని వర్గాలకు చేసినట్లే మోసం చేశాడు  చూస్తూ చూస్తూ మూడున్నర  సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఎన్నికల స్టంట్ లో భాగంగా అనేక రకాల షరతులు పెట్టాడు. షాదీ సోఫా పథకం ఇవ్వాలంటే వరుడు వధువు ఇద్దరూ  పదవ తరగతి పాసై ఉండాలని నిబంధన పెట్టాడు.

 

 

అయితే ఈ విషయంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో దానిని ఉపసంహరించుకున్నాడు. పట్టణ ప్రాంతాల్లో అయితే 12 వేల రూపాయలకు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదివేల రూపాయలు ఆదాయం మించి ఉండకూడదని, 300 యూనిట్లకు మించి కరెంటు కాల్చి ఉండకూడదని ఇంకా అనేక రకాలైన షరతులు విధించాడు. ఇవన్నీ ఎగవేత చేయడాని కె అని ఎద్దేవా చేశారు. దారిద్ర రేఖకు దిగువన ఉన్న  వారికి కేటాయించిన తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని మరియు రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్తామని  చెప్పారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు శ్యామల, లోకేశ్వరి ఎం ఆర్ ఎఫ్ అధ్యక్షులు- షేక్ దస్తగిరి, మాజీ కార్పొరేటర్- రహమతుల్లా ఖాన్, జనసేన నగర అధ్యక్షులు- గౌస్ బాషా, లోక్సత్తా నాయకులు – శ్రీకృష్ణదేవరాయ, ఇన్సాఫ్ నగర కార్యదర్శి – మైనుద్దీన్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు – ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: For marriage gift, shadi tofa should be executed from the beginning

Post Midle

Leave A Reply

Your email address will not be published.