సెల్ఫీ లవర్స్‌ కోసం.. అదిరిపోయే ఫీచర్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌

న్యూ ఢీల్లీ ముచ్చట్లు:

స్మార్ట్‌ఫోన్‌లో దాదాపు అందరి చేతుల్లోనూ ఉంటున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లకు కెమెరాలు తప్పనిసరి హంగు. చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ఉంటే జనాలు ఆగుతారా? ఎడాపెడా సెల్ఫీలతో పాటు ప్రయాణాల్లో కనిపించిన దృశ్యాలనల్లా ఫొటోలు తీసేయడం మామూలైపోయింది. వందలాదిగా తీసిన ఫొటోలను ప్రింట్‌ చేయడం కొంత కష్టమే! ఫొటో ల్యాబ్‌లకు వెళ్లాలి. స్మార్ట్‌ఫోన్‌లో తీసిన ఫొటోలను కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్‌ చేసి, నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని ప్రింట్‌ చేయించుకోవాలి.ఇదంతా కొంత ప్రయాసతో కూడిన ప్రక్రియ. ఇప్పుడంత ప్రయాస అక్కర్లేదు. స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ప్రింటర్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా జపానీస్‌ ఫొటోగ్రఫీ బ్రాండ్‌ ‘ఫుజీ ఫిల్మ్‌’ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఫొటోలను నేరుగా ప్రింట్‌ చేసేందుకు అనువైన స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ప్రింటర్‌ను ‘ఇన్‌స్టాక్స్‌ మినీలింక్‌ 2’ పేరిట అందుబాటులోకి తెచ్చింది.

 

స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఈ ప్రింటర్‌ కూడా వెంట ఉంటే, ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు ఫొటోలను ప్రింట్‌ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది జపాన్‌తో పాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మార్కెట్‌లలో అందుబాటులో ఉంది.

 

Tags: For selfie lovers.. this smartphone has an amazing feature

Leave A Reply

Your email address will not be published.