పుంగనూరు ప్రజల ఆరోగ్యానికి అండగా -ఎంపీ రెడ్డెప్ప

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా నిలిచి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం క్రింద రూ.1000 వైద్య సేవల నుంచి కోట్లాది రూపాయల వరకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యసేవలు అందిస్తోందని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తెలిపారు. మంగళవారం జిల్లా డిప్యూటి డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయూష్మాన్‌ భారత్‌ ప్లెక్సిలను ఎంపీ విడుదల చేశారు. ఎంపీ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందించడం జరుగుతోందన్నారు. ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు ఆయూష్మాన్‌ భారత్‌, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాలను వినియోగించుకోవాలన్నారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద అన్ని రకాల బాధితులకు ఎప్పటికప్పుడు ఆర్థిక సహాయం అందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో వెల్‌నెస్‌ సెంటర్లు, పట్టణ ప్రాంతాల వారీగా ఆసుపత్రుల ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల వైద్యసేవలు ఇంటి వద్దనే అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులు, ఆయూష్మాన్‌ భారత్‌ కార్డులను పంపిణీ చేశారు.

 

Tags: For the health of Punganur people – MP Reddappa

Leave A Reply

Your email address will not be published.