Natyam ad

ప్రజల ఆరోగ్యం కోసమే

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించినట్లు రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం అన్నారు. శనివారం పట్టణంలోని అర్భన్‌ హెల్త్ సెంటర్‌లో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ తో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురక్ష కరపత్రాలు విడుదల చేశారు. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి , మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు నరసింహులు, మమత, రామకృష్ణంరాజు, కమలమ్మ, సాజిదా, మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: For the health of the people

 

Post Midle