Corona with sex

కోవిడ్-19 కట్టడి కోసం 

-దాల్మియా సిమెంట్స్  సహకారం
-రూ. 12.5 లక్షల విలువైన 2500 పిపిఈ కిట్ల విరాళం

Date:29/06/2020

కడప ముచ్చట్లు:

కరోనా  వైరస్ ( కోవిడ్ -19)  మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనే చర్యల్లో భాగంగా కడప జిల్లాకు చెందిన దాల్మియా సిమెంట్స్ (భారత్ లిమిటెడ్) యాజమాన్యం రూ. 12.5 లక్షల ఖర్చుతో.. ఒక్కొక్కటీ రూ.500ల విలువైన 2500 పిపిఈ (స్వీయ రక్షక కవచాలు) కిట్లను విరాళంగా అందజేసింది. ఈ మేరకు సంబందిత  పిపిఈ కిట్లను దాల్మియా ప్లాంట్ హెడ్ కరుణాకర్ రెడ్డి, సీఏ హెడ్ నరేందర్ మిసా సోమవారం జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ కు అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ.. కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా తమవంతు సహాయం అందిస్తున్న దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా జిల్లా యంత్రాంగమైన వైద్యులు, పారమెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీసు యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు ఎంతగానో శ్రమిస్తున్నారన్నారు. ప్రభుత్వ చర్యలతో పాటు.. జిల్లా ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం అన్నారు.
ఈ కార్యక్రమంలో జేసీ (ఆసరా, సంక్షేమం) శివారెడ్డి,  ప్రముఖ పారిశ్రామికవేత్త రాజోలి వీరారెడ్డి పాల్గొన్నారు.

“వైఎస్ఆర్ నవోదయం” ద్వారా. 

Tags: For the Kovid-19 tightening

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *