వరుణ దేవుడి కటాక్షం కొరకు,తుంగభద్ర నదీజలాలతో దైవందిన్నె శ్రీశ్రీ నరసింహస్వామికి జలాభిషేకం.

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

ఎమ్మిగనూరు మండల పరిధిలో రైతులు సుభిక్షంగా ఉండాలని,ఎండుతున్న పంటలు పచ్చదనం తో పంటలు బాగా పండి సిరులు కురిపించాలని,వరుణ దేవుడి కటాక్షం కొరకు కర్నూలు జిల్లా,ఎమ్మిగనూరు మండల పరిధిలోని దైవందిన్నె గ్రామ ప్రజలు అశేష భక్త జనంతో,అత్యంత భక్తిశ్రద్ధలతో దైవనమస్మరణ చేసుకుంటూ ఆలయ అర్చకులతో పాదయాత్రగా తుంగభద్ర నదీతీరానికి బయలుదేరి,నదీతీరంలో నిద్రచేసి,తిరిగి తెల్లవారు జామున నదీమతల్లికి నిండు మనస్సు తో పూజలు చేసిన అనంతరం అక్కడ నుండి తిరిగి పాదయాత్ర గా గ్రామానికి చేరుకుంటారు. గ్రామస్తులు,భక్తులు భాజభజంత్రీలతో గ్రామంలో వెలసిన శ్రీశ్రీ లక్ష్మీ నరసింహస్వామికి తుంగభద్ర నది నుండీ తెచ్చిన నదీజలాల తో అభిషేకం చేశారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన రామలింగప్ప మాట్లాడుతూ ప్రతి శ్రావణ మాసంలో పంటలు బాగా పండాలని, రైతులు,

 

గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని తుంగభద్ర నదికి పోయి నదీ జలాలను తెచ్చి గ్రామంలో వెలసిన శ్రీశ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేస్తామని, ఇలా చేస్తే మాకు అంతా మంచి జరుగుతుందని తెలిపారు. అలాగే శ్రీశ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన దేవాలయం నిర్మాణం చేపట్టామని,ఇందులో భాగంగా భక్త్తులు పెద్దఎత్తున భాగస్వామ్యంగా ఉండి దేవాలయ నిర్మాణానికి తమ వంతు సహాయ,సహకారాన్ని అందించాలని కోరారు.ఈకార్యక్రమంలో చాకలి ఎల్లప్ప బి రామలింగప్ప నడుపు నరసన్న చిట్టి నరసింహులు చుక్క నరసింహులు ఎల్లప్ప జమ్మన్న ఈరన్న సూరి ఓబులేసు ఎర్రన్న హనుమంతు పేటయ్య నాగన్నజగన్నాథ్ నరసన్న,భక్తులు, గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

 

Tags: For the sake of Lord Varuna, water bath was offered to Sri Sri Narasimhaswamy with Tungabhadra river waters.

Leave A Reply

Your email address will not be published.