Natyam ad

 విద్యా దీవెన  43,707 మంది విద్యార్థులకు సంబంధించి- 38,673 మంది తల్లుల ఖాతాలలో రూ.25.61 కోట్లు జమ

– జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

నంద్యాల ముచ్చట్లు:

Post Midle

జిల్లాలో నాలుగవ విడత జగనన్న విద్యా దీవెన కింద 2022 జులై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 43,707 మంది విద్యార్థులకు గాను అర్హులైన 38,673 మంది తల్లుల ఖాతాలలో రూ.25.61 కోట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి జమ చేసారని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ పేర్కొన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి బహిరంగ సభ వేదిక నుంచి 4వ విడత జగనన్న విద్యా దీవెన పథకం సంబంధించి 2022 జులై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించే కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ వీక్షించారు.

 

 

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ జిల్లాలో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా జీవన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. చదువుల ఖర్చుతో తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజుల మొత్తాలను నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోందన్నారు. ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోందన్నారు. కాలేజీల్లో జవాబుదారీతనం పెరిగేలా, విద్యార్థుల తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ, తల్లుల సాధికారతకు పట్టం కడుతూ  నేరుగా వారి ఖాతాల్లోనే రాష్ట్ర జమ చేస్తోందన్నారు.

 

 

ఇందులో ఎస్ సి సంక్షేమం కింద 10,639 మంది విద్యార్థులు ఉండగా, 9,394 మంది తల్లి ఖాతాలల్లో 5.53 కోట్లు, ఎస్ టి సంక్షేమం కింద 1417 మంది విద్యార్థులు* ఉండగా, 1129 మంది తల్లి ఖాతాలల్లో 0.77 కోట్లు, బిసి సంక్షేమం కింద 17,099 మంది విద్యార్థులు ఉండగా, 15,009 మంది తల్లి ఖాతాలల్లో 9.81 కోట్లు, ఈబిసి కింద 4,826 మంది విద్యార్థులు ఉండగా, 4,420 మంది తల్లి ఖాతాలల్లో 4.06 కోట్లు, ముస్లిం మైనారిటీ కింద 6,808 మంది విద్యార్థులు ఉండగా, 5,985 మంది తల్లి ఖాతాలల్లో 3.64 కోట్లు, కాపు సంక్షేమం కింద 2,824 మంది విద్యార్థులు ఉండగా, 2,652 మంది తల్లి ఖాతాలల్లో 1.74 కోట్లు, క్రిస్టియన్ మైనారిటీ కింద 94 మంది విద్యార్థులు ఉండగా, 84 మంది తల్లి ఖాతాలల్లో 0.06 కోట్లు వెరసి మొత్తం 43,707 మంది విద్యార్థులకు గాను అర్హులైన 38,673 మంది తల్లుల *ఖాతాలలో రూ.25.61 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులను అభ్యసించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

 

 

అనంతరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద 2022 జులై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 43,707 మంది విద్యార్థులకు గాను అర్హులైన 38,673 మంది తల్లుల ఖాతాలలో రూ.25.61 కోట్ల మెగా చెక్కును సంబంధిత విద్యార్థులు, తల్లులకు జిల్లా కలెక్టర్, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చింతామణి, వివిధ సంక్షేమ అధికారులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.

 

Tags; For Vidya Dievena 43,707 students- Rs.25.61 crores deposited in the accounts of 38,673 mothers

Post Midle