గెలివి స్కూల్లో నిషేధిత స్టార్ తాబేళ్లు
గుర్తించిన అటవీ శాఖ అధికారులు
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. గెలివి స్కూల్లో ఏడు నక్షత్ర తాబేలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పక్కాగా సమాచారం అందడంతో.. ఆకస్మిక సోదాలు నిర్వహించారు ఫారెస్ట్ అధికారులు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వాటితో బిజినెస్ చేసేందుకు కాకుండా.. అవి స్కూల్లో ఉంటే మంచి జరుగుతుందన్న సెంటిమెంట్తో వాటిని అక్కడికి తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న తాబేళ్ళను సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలేశారు. స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి.. తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. నక్షత్ర తాబేళ్లు చాలా అరుదుగా కనిపిస్తాయని అధికారులు తెలిపారు.

Tags: Forbidden star turtles in the winning school
