నా చేత బలవంతంగా రాజీనామా చేయించారు

కరీంనగర్  ముచ్చట్లు:
హుజురాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ పాదయాత్రతో దూసుకుపోతున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన గురువారం ఇల్లంతకుంట మండలంలోని మర్రివానిపల్లె, సీతంపేటలో పర్యటించారు. ఈ క్రమంలోనే వర్షంలోనే ప్రసంగించారు. ఈ క్రమంలో తాను రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.నిజానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి తనంతతానుగా రాజీనామా చేయలేదని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ అధిష్ఠానం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తేనే తాను అలా చేసినట్లు పేర్కొన్నారు. అసలు టీఆర్ఎస్ పార్టీని తాను వదలలేదని, వదిలేలా వాళ్లే చేసుకున్నారని అన్నారు. అయిన వాళ్లకు ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల్లో కేసీఆర్ పెడుతుంటారని ఈటల విమర్శించారు.హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం నియోజకవర్గ వ్యాప్తంగా ఈటల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇల్లంతకుంట మండలం మర్రివానిపాలెం నుంచి నడుచుకుంటూ సీతంపేటకు చేరుకున్నారు. అక్కడే తాజా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈటల ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags:Forced resignation by me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *