వైజాగ్ లో ఫోరెన్సిక్ ల్యాబ్

Forensic Lab in Vizag

Forensic Lab in Vizag

Date:15/08/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
స్మార్ట్‌సిటీగా రూపాంతరం చెందుతున్న విశాఖలో సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నేరాలను అరికట్టడానికి విశాఖలో సైబర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.కోటి కేటాయిస్తూ శాశ్వత భవన నిర్మాణానికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. నూతన భవనం పూర్తయ్యేంత వరకూ ఎక్కడైనా తాత్కాలికంగా దీనిని ఏర్పాటు చేసుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌్‌కు ప్రభుత్వం సూచించింది. దీంతో ఆయన వుడా కాంప్లెక్స్‌లోని రెండో అంతస్తులో ఖాళీగా వున్న స్థలాన్ని తమకు కేటాయించాలని వుడా వీసీ బసంత్‌కుమార్‌కు లేఖ రాశారు.
స్థలం కేటాయించడంతో మరో వారంలో సైబర్‌ ల్యాబ్‌ కార్యకలాపాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోనే తొలి సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ విశాఖలో ఏర్పాటు చేసినట్లు గుర్తింపు లభించనుంది.
విశాఖ నగరాభివృద్ధితో పాటు నేరాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. గత మూడేళ్లలో సుమారు 950 కేసులు నమోదుకాగా వీటిలో 230కి పైగా కేసులు ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నాయి. సైబర్‌ కేసుల్లో నేరస్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ కలిగిన ల్యాబ్‌ నగర పోలీసులకు అందుబాటులో లేకపోవడంతో పెండింగ్‌ కేసుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది.
విశాఖలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా ల్యాబ్‌ లేకపోవడంతో సైబర్‌ కేసుల దర్యాప్తులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ వంటి పరికరాలోని డేటా అనాలసిస్‌ కోసం హైదరాబాద్‌లోని సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాల్సి వస్తోంది. ఫలితంగా తీవ్రమైన కాలయాపన జరగడం, కోర్టులో కేసు విచారణ సమ యంలో అవసరమైన ఆధారాలను సమర్పించలేక పోవడంతో నిందితులు తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను కేటాయించాలని కోరుతూ కొన్నేళ్లుగా పోలీస్‌ కమిష నర్లుగా పని చేసిన అధి కారులంతా ప్రభుత్వానికి లేఖలు రాస్తూ వచ్చారు.
Tags:Forensic Lab in Vizag

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *