ఆటవీ శాఖ ర్యాలీ

Date:11/09/2020

నాగర్ కర్నూలు  ముచ్చట్లు:

అటవీ ఉద్యోగులుగా విధి నిర్వహణలో అటవీ అమరవీరుల  తమ ప్రాణాలను త్యాగం చేశారని ఫారెస్ట్ రేంజర్ రవీందర్ నాయక్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో అటవీశాఖ ఆధ్వర్యంలో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకున్నారు.  కొల్లాపూర్ లో ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు.  అటవీశాఖ కార్యాలయంలో అటవీ అమరవీరులకు పూలు చల్లి శ్రద్దాంజలి ఘటించారు.  మౌనం పాటించి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.  జంగిల్ బచావో జంగిల్ బడావో నినాదంతో అటవీశాఖలో పని చేయాలని రేంజర్ రవీందర్ నాయక్ అన్నారు.  1737లో అంటే 300 ఏళ్లక్రితం అదే సెప్టెంబర్ 11న రాజస్థాన్లో అటవీ చెట్లను నరకడాన్ని వ్యతిరేకిస్తున్న అక్కడ ప్రజలు చేసిన ప్రాణ త్యాగాలకు గుర్తుగానే నేడు అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అని గుర్తు చేసుకున్నారు.

కలెక్టర్ తో డాక్టర్ వాగ్వివాదం

Tags:Forest Department Rally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *