Natyam ad

అభివృద్ధికి ఆమడ దూరంలో రూపం పేట ఎస్సీ కాలనీ

దశాబ్ద కాలం అయినా దళితవాడల బతుకులు మారవా
విద్యుత్ స్తంభాలు విరిగిపోయే పరిస్థితిలో ఉన్న పట్టించుకోని విద్యుత్ అధికారులు..
సిపిఐ పట్టణ కార్యదర్శి  బాలు..

బద్వేలు ముచ్చట్లు:

Post Midle

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చేపట్టిన వార్డుల పర్యటనలో భాగంగా మూడవరోజు రూపరామపేట దళిత వాడను సిపిఐ బృందం పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ బద్వేల్ పట్టణ సమితి కార్యదర్శి పెద్దపల్లి బాలు మాట్లాడుతూ దళితవాడలపై పాలకుపక్షాలు అధికారులు వివక్ష చూపుతున్నారని,130 కోట్ల నిధులలో మున్సిపాలిటీ లో ఉన్న ఎస్సీ కాలనీలకు ఎంత కేటాయించారో అధికారులు శ్వేత పత్రం రిలీజ్ చేయాలని, 130 కోట్ల నిధులలో ఎస్సీ కాలనీల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం. ఆంతర్యం ఏమిటని దీని వివక్ష  అనక  ఏమంటారు అని ఆయన ప్రశ్నించాడు. రూపం పేట కాలనీలో విద్యుత్ స్తంభాలు విరిగిపోయే పరిస్థితిని అక్కడ ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని సిపిఐ పార్టీ బృందానికి తెలియజేశారు అదేవిధంగా మా కాలనీలో ఇంతవరకు సిసి రోడ్డు కూడా వేయలేదని వారు తెలియజేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాల ప్రమాదాల బారి నుండి అక్కడ జనాన్ని కాపాడాలని వారు కోరారు. 130 కోట్ల నిధులు తెచ్చి బద్వేల్ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేసి సుందరీ కరణ చేస్తామని ప్రగల్బాలు పలకడమే అభివృదే అయితే పేద బడుగు బలహీన వర్గాలు నివాసాలు ఉంటున్న ప్రాంతాలలో అభివృద్ధి ఏమైందని ఆయన ప్రశ్నించారు. పేదల కాలనీలో ఎందుకు అభివృద్ధి చేయలేదో పాలక పక్షాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఇప్పటికైనా బద్వేల్ పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించకపోతే రాబోయే కాలంలో ప్రజలే తిరగబడతారని ఆయన హెచ్చరించాడు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పడిగ వెంకటరమణ, పట్టణ సమితి సభ్యులు నాగ సుబ్బయ్య సుబ్బారెడ్డి శిలపం రమణ, ఏసన్న తదితరులు పాల్గొన్నారు.

 

Tags; Form Peta SC Colony is not far from development

Post Midle