Natyam ad

ఏపీ పోలీసులపై ఫిర్యాదులకు కంప్లైంట్స్‌ అథారిటఏర్పాటు.

అమరావతి ముచ్చట్లు:

 

రాష్ట్రంలోని పోలీసులపై వచ్చే ఫిర్యాదులను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీని ఏర్పాటు చేసింది.పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ సభ్యులుగా ముగ్గురు రిటైర్డు ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.అథారిటీ సభ్యులుగా రిటైర్డు ఐఎఎస్‌ ఉదయలక్ష్మి, రిటైర్డు ఐపిఎస్‌ అధికారులు కెవిబి గోపాలరావు,బత్తిన శ్రీనివాసులును ప్రభుత్వం నియమించింది.వీరు పోలీసులపై వచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకుని విచారణ చేస్తారు.ఉత్తరాంధ్ర జిల్లాలకు విశాఖపట్నం,కృష్ణా, పశ్చిమ గోదావరి,తూర్పు గోదావరి జిల్లాలకు రాజమండ్రి, గుంటూరు, ప్రకాశం,నెల్లూరు జిల్లాలకు గుంటూరు,రాయలసీమ జిల్లాలకు కర్నూలు కేంద్రంగా కమిటీలను ఏర్పాటు చేసింది.ప్రతి కేంద్రంలో ముగ్గురు రిటైర్డు డిఎస్‌పి,అడిషనల్‌ ఎస్‌పి స్థాయి అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది…!!

 

Tags:Formation of Complaints Authority for complaints against AP Police.

Post Midle
Post Midle