కాంగ్రెస్ తోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. 

-కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా

-కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కోరుట్ల  ముచ్చట్లు:

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చొరవతోనే జరిగిందని కాంగ్రెస్ పార్టీ మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా అన్నారు. బుధవారం
మెట్ పెల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపం లోని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం
మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం గుర్తించిన సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాచరిక పాలన సాగిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్లోని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ సీనియర్ నాయకుడు జెట్టి లింగం, కొమిరెడ్డి లింగారెడ్డి, మైనారిటీ వైస్  ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెట్టి లక్ష్మణ్, యూత్ నాయకులు కోటగిరి చైతన్య, మహమ్మద్ రిజ్వాన్ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Formation of Telangana state with Congress.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *