అమరావతి ముచ్చట్లు:
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. దాదాపు నలభై రోజుల వ్యవధిలో ఆయన బెంగళూరుకు వెళ్లడం ఇది నాలుగోసారి. మాజీ సీఎం గత మంగళవారం బెంగళూరు నుంచి తిరిగి వచ్చారు. ఐదు రోజుల వ్యవధిలో తిరిగి వెళ్లారు. ఈ నెల 5న లేదా 6న ఆయన తాడేపల్లికి తిరిగి రానున్నారని సమాచారం.సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీలో ధర్నాకు హాజరయ్యారు. ఇప్పటివరకూ రెండుసార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ తొలిరోజు మాత్రం హాజరై తిరిగి వెళ్లిపోయారు.ఎపిలో వైకాపా ఘోర పరాజయం తర్వాత తెలుగు దేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలో వచ్చింది. కేవలం 11 సీట్లకే పరిమితమైన వైకాపా అవమానభారంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ చేరుకుంటారని ప్రచారం అయితే జరిగింది కానీ జగన్ హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ గడపదొక్కలేదు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ మాజీ సిఎం కెసీఆర్ తుంటి ఎముక విరిగి యశోదాహస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో జగన్ హైదరాబాద్ కు వచ్చారు. అప్పట్లో లోటస్ పాండ్ వెళతారని అందరు అనుకున్నారు. కానీ జగన్ అప్పుడు కూడా లోటస్ పాండ్ వెళ్లలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో కొనసాగుతుంది. హైదరాబాద్ సేప్ జోన్ కాదని జగన్ డిసైడైపోయారు. ఈ కారణంగానే బెంగుళూరు వెళుతున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన డికె శివకుమార్ కర్ణాటక డిప్యూటి సీఎం పదవిలో కొనసాగుతున్నారు.
కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరగా ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చని జగన్ భావిస్తున్నారు. కాబట్టే బెంగుళూరుకు షిప్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారు. వైకాపా తిరిగి అధికారంలోకి రావడం కల్ల అని జగన్ కు తెలిసి పోయింది. దీంతో ఆయన ఎక్కువగా బెంగుళూరులోని యెలహంక ప్యాలెస్ కు పరిమితమయ్యారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా కట్టిన తాడేపల్లిలోని వైకాపా కార్యాలయాన్ని కూటమి ప్రభుత్వం కూల్చి వేసింది. ప్రస్తుతం తాడేపల్లిలో ఆయన నివాసానికి తాళం వేసే ఆలోచనలో ఉన్నారు. రాజకీయంగా అధోపాతాళానికి పడిపోయిన జగన్ మళ్లీ కోలుకునే అవకాశం లేదు. అవమానభారంతో కుమిలిపోతున్న జగన్ మొహం చాటేయాలని డిసైడ్ అయ్యారు. తాను గత 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న యెలహంక ప్యాలెస్ కు గత పదేళ్లుగా దూరంగా ఉన్నారు. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు ఆనుకుని 30 ఎకరాల్లో యెలహంక ప్యాలెస్ ఉంది. వైకాపా పెట్టిన తర్వాత ఆయన తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యారు. వైకాపా పెట్టిన తర్వాత హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించారు. ఎపిలో వైకాపా అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా తాడేపల్లి నివాసానికి పరిమితమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఓటమి తర్వాత జగన్ పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారు. తెలుగు దేశం ప్రభుత్వాన్ని నిలువరించే సత్తా జగన్ కు లేకపోవడంతో బిస్తర్ ఎత్తేశాడని ప్రచారం జరుగుతుంది.
Tags: Former Chief Minister Jagan left for Bangalore