మాజీ సీఎం కేసీఆర్కు గాయం.. ఆస్పత్రిలో చికిత్స.

హైదరాబాద్ ముచ్చట్లు:

 


మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలుజారి పడటంతో  గాయమైయింది. గురువారం ఆర్ధరాత్రి ఘటన జరిగింది. ఆర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు వెల్లడించారు. . శస్త్రచికిత్స అవసరం అవుతుందని సూచించారు.కేసీఆర్ తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.  విషయం తెలియగానే  కేసీఆర్ కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలివెళ్లారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత కుడా ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో చర్చించారు.
ఎమ్మెల్సీ కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ… కేసీఆర్ కి స్వల్ప గాయం అయిందని… ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. అందరి ప్రార్థనలు, ఆకాంక్షలతో నాన్న త్వరలోనే కోలుకుంటారని చెప్పారు.

Tags: Former CM KCR injured.. treated in hospital.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *