Natyam ad

బీజేపీ గూటికి  మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:


ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ  కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ పార్టీ ముఖ్యనేతలు అరుణ్ సింగ్, లక్ష్మణ్  సమక్షంలో శుక్రవారం ఆయన కాషాయ కండువా వేసుకున్నారు.  కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారని, దీంతో ఏపీలో తమ పార్టీ బలోపేతం అవుతుందని ప్రహ్లాద్ జోషి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి వివిధ పదవులు చేపట్టారు. 2010 నవంబర్ 25 నుంచి 2014 మార్చి 1 వరకు సీఎంగా ఆయన పనిచేశారు. అంతకుముందు శాసనసభ స్పీకర్గా, ప్రభుత్వ చీఫ్ విప్గా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున ఆయన బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తిరిగి కాంగ్రెస్లో చేరారు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్కు రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో శుక్రవారం కీలక నేతల సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు పలువురు జాతీయ నేతలు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తదితరులు కిరణ్కుమార్రెడ్డిని అధికారికంగా బీజేపీలోకి ఆహ్వానించారు.  కొద్దిరోజుల క్రితమే ఆయన కాంగ్రెస్కు అధికారికంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ అధిష్టానం నుంచి కీలక బాధ్యతల హామీతోనే ఆయన పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఉమ్మడి ఏపీలో అయన  నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. వైఎస్సార్ హయంలో కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్గా, అసెంబ్లీ స్పీకర్గానూ ఆయన పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు(2010 నుంచి 2014 వరకు).  విభజన బిల్లుకు వ్యతిరేకిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేసి ఆపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొన్నాళ్లు కొనసాగారు. ఆ సమయంలో కాంగ్రెస్కు రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీని రద్దు చేస్తూ 2018లో తిరిగి కాంగ్రెస్లో చేరారాయన. అయనకు  తెలంగాణ బీజేపీ తరపున కీలక బాధ్యతలు అప్పజెప్తారనే ఆసక్తికరమైన ప్రచారం నడుస్తోంది.

 

Post Midle

Tags: Former CM Kiran Kumar Reddy of BJP

Post Midle