మాజీ కార్పొరేటర్ దారుణహత్య

బెంగళూరు ముచ్చట్లు :

 

 

బెంగళూరు ఉద్యాన నగరిలో దారుణం చోటుచేసుకుంది. 138 వార్డుకు చెందిన మాజీ కార్పొరేటర్ రేఖకదిరేశ్ (40) పై గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. ఆమె ఫ్లవర్ గార్డెన్ లో నివాసం ఉంటున్నారు. అన్నదాన కార్యక్రమం ఉండడంతో ఆమె పార్టీ కార్యాలయానికి వెళ్ళారు. కొందరు దుండగులు వచ్చి ఆమెను బయటకు పిలిచి విచక్షణా రహితంగా దాడి చేసి పారిపోయారు. పోలీసులు ఆమెను కెంపెగౌడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Former corporator massacre

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *