ఫీల్డింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టీవ్ రిక్సన్‌

Former cricketer Steve Rickson as fielding coach

Former cricketer Steve Rickson as fielding coach

Date:08/12/2018
ముంబై ముచ్చట్లు:
 ఫీల్డింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టీవ్ రిక్సన్‌ నియమితులయ్యారు. 2019 వరల్డ్ కప్ ముగిసే వరకు రిక్సన్ ఈ పదవిలో ఉంటారని లంక క్రికెట్ బోర్డ్ తెలిపింది. డిసెంబర్ 24న న్యూజిలాండ్‌లో రిక్సన్‌ జట్టుతో చేరతారు. మనోజ్ అబేవిక్రమ స్థానంలో రిక్సన్ బాధ్యతలు చేపడతారు. ఫీల్డింగ్ కన్సల్టెంట్ పదవి నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో నిక్ పోతస్ వైదొలగగా.. మనోజ్ తాత్కాలిక ఆ బాధ్యతలను నిర్వర్తించారు. రిక్సన్ ఆస్ట్రేలియా తరఫున 13 టెస్టులు, ఆరు వన్డేలు ఆడారు. ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. రిక్సన్ రెండేళ్లపాటు పాకిస్థాన్ ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశారు. వేతనం ఆలస్యంగా చెల్లించడం, ప్రొఫెషనలిజం లోపించిందనే కారణాలతో ఈ జూన్‌లో ఆయన కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. వాస్తవానికి 2013లో రిక్సన్‌ను ప్రధాన కోచ్‌గా తీసుకోవడానికి శ్రీలంక క్రికెట్ బోర్డ్ ఆసక్తి చూపింది. కానీ అంతర్జాతీయ కోచ్‌కు అందాల్సిన స్థాయిలో రెమ్యూనరేషన్ లేదనే కారణంతో.. ఆయన లంక బోర్డ్ ఆఫర్‌ను ఆయన తిరస్కరించారు.
Tags:Former cricketer Steve Rickson as fielding coach

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *