Natyam ad

 టిడిపి ఇన్చార్జ్ జి.ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన కమలాపురం మాజీ శాసనసభ్యులు జి.వీర శివారెడ్డి

కడప ముచ్చట్లు:


పొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని కమలాపురం నియోజకవర్గంలోని ఆరు మండలాల వీరశివా రెడ్డి అనుచరులు భారీ సంఖ్యలో కడప సబ్ జైల్ వద్దకు చేరుకొని ప్రవీణ్ కుమార్ రెడ్డి ని పరామర్శించారు. జి వీరశివా రెడ్డి,  కుటుంబం పాటు పొద్దుటూరు టిడిపి ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి సతీమణి, కుటుంబ సభ్యులు పరామర్శించి ఆయన బాగోగులు అడిగి తెలుసుకున్నారు. మాజీ శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని అందులో భాగంగా ప్రవీణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరమని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో గ్రహణం పట్టినట్టు జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని గ్రహణం వీడే సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు.

 

Tags: Former Kamalapuram MLA G. Veera Siva Reddy visited TDP in-charge G. Praveen Kumar Reddy

Post Midle
Post Midle