కెళవాతిలో ఘనంగా దివంగత మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి 8 వ వర్దంతి వేడుకలు

Former late MP Ramakrishna Reddy celebrated 8th anniversary celebrations in Kelavati

Former late MP Ramakrishna Reddy celebrated 8th anniversary celebrations in Kelavati

Date:14/08/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బారీ పరిశ్రమల శాఖా మంత్రి నూతన కాల్వ అమరనాథ్ రెడ్డి తండ్రి, స్వర్గీయ మాజీ తెదేపా ఎంపీ నూతన కాల్వ రామకృష్ణారెడ్డి 8 వ వర్దంతి వేడుకలు ఆయన స్వగ్రామమైన కెళవాతిలో కుటుంబ సభ్యులతో పాటు ఆ పార్టీ నేతలు ఘనంగా జరుపుకున్నారు.

 

కీర్తిశేషులు మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి ఘాట్ వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయన తెదేపా అభివృద్ధి కి ప్రజల అభివృద్ధికి చేసిన కృషిని, సేవలను గుర్తు చేసుకున్నారు.

 

 

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి సతీమణి, వీరప్పల్లె మాజీ సర్పంచి తాయారమ్మ, తనయుడు, మంత్రి అమరనాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి, రెండో తనయుడు, పుంగనూరు తెదేపా సమన్వయకర్త శ్రీనాథరెడ్డి, సతీమణి అనీషా రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు సులోచన, ఎంపీపీ మురళీకృష్ణ, మండల తెదేపా అధ్యక్షుడు శ్రీరాములు,

 

కార్యదర్శి మురహరిరెడ్డి, జిల్లా తెదేపా కార్యవర్గ సభ్యుడు రోజా క్రిష్ణారెడ్డి, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి భానుప్రతాప్ రెడ్డి, నాయకులు రామకృష్ణ, వేణుగోపాల్ నాయుడు, ఎంపీటీసి లు, మాజీ సర్పంచ్ లు తెదేపా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు వ్యక్తిత్వ వికాసం అలవర్చుకునేందుకు గురువు కావాలి

Tags: Former late MP Ramakrishna Reddy celebrated 8th anniversary celebrations in Kelavati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *