మాజీ మంత్రి కమతం రామిరెడ్డి మృతి

Date:05/12/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

టీఆర్ ఎస్  సీనియర్ నేత మాజీ మంత్రి కమతం రామిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం  తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పరిగి ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎన్నికైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక పదవులు నిర్వహించారు. కోట్ల విజయభాస్కర్రెడ్డి మంత్రివర్గంలో రాంరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. జలగం వెంకట్రావు ఎన్ జనార్దన్రెడ్డి మంత్రివర్గాల్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు.కమతం రామిరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డితో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రామిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగిన అయన.. 2014 ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతో బీజేపీలో చేరారు. టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల అనంతరం నెలకొన్న రాజకీయణ పరిణామాల నేపథ్యంలో బీజేపీని వీడి టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. కానీ వయసు పైబడడం వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.ఇటీవలే మాజీ మంత్రి స్పీకర్ నాయిని నర్సింహారెడ్డి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య   మరణించిన విషయం తెలిసిందే.

పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Former minister Kamath Ramireddy has died

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *