మావోయిస్టు ప్రభావిత బూసుపుట్టులో మాజీ మంత్రి కిడారి పర్యటన

బూసుపుట్టులో పి.హెచ్.సి ఏర్పాటు చేయాలి
మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్

అల్లూరి ముచ్చట్లు:

అరకు నియోజకవర్గం ముంచంగిపుట్టు మండలం మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బూసుపుట్టు పంచాయితీలో అరకు నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మండల టీడీపీ నాయకులతో కలిసి పర్యటించారు.  ఈ సందర్భంగా మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ బూసూపుట్టు పంచాయితి పరిధిలో సుమారుగా మూడు పంచాయితీలకు సంబందించి సుమారుగా రెండు వందల గ్రామాల  ప్రజలు ఉన్నారని అత్యవసర పరిస్థితుల్లో కనీసం అంబులెన్స్ సేవలు అందించే పరిస్తితి లేదని అన్నారు.
రాష్ట్ర వైసిపి ప్రభుత్వం కనీసం పట్టించుకునే  స్థితిలో లేదనీ బూసుపుట్టులో తక్షణమే పి హెచ్ సి ఏర్పాటు చేయాలని అదే విధంగా సంత షెడ్డు లేక సంతకు వచ్చిన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారనీ రాష్ట్ర వైసిపి ప్రభుత్వం స్పందించి వెంటనే పి హెచ్ సి,సంత షెడ్డు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరి శాస్త్రి బాబు,దారెల సర్పంచ్ పాండురంగ స్వామి,అరకు పార్లమెంట్ ఐటీడీపి అద్యక్షుడు కూడ వెంకటరావు,బూసిపుట్టు మాజీ సర్పంచ్ కిముడు ముత్యాలమ్మ,మాజీ సర్పంచ్ మంగ్లన్న,టీడిపి సీనియర్ నాయకులు నీలకంఠ పాత్రో, అర్జున్,టిఎన్ఎస్ఎఫ్ మండల నాయకులు పేలమల చిరంజీవి,శంకరరావు,టీడిపి నాయకులు వంతల గణపతి, పాంగి భాస్కరరావు,కుమడ టీడిపి నాయకులు జగదీష్, సూర్యనారాయణ పడల్,కుమడ టీడిపి కిలో కామేశ్వరరావు,అనిల్,తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Former minister Kidari’s visit to Maoist-affected Boosuputtu

Leave A Reply

Your email address will not be published.