వైకాపాలోకి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ

Former minister Konstala Ramakrishna

Former minister Konstala Ramakrishna

Date:14/03/2019
విశాఖపట్నం ముచ్చట్లు:
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అనుచరులతో సమావేశం అనంతరం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం  ఉదయం హైదరాబాద్కు ఆయన బయలుదేరనున్నారు. లోటస్ పాండ్కు వెళ్లి జగన్ను కలిసి పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కొణతాల టీడీపీలో చేరనున్నారని గత కొంత కాలంగా ప్రచారం జరిగింది. ఆయనకు టీడీపీలో టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఆయన అనూహ్యంగా వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. జిల్లాకు చెందిన మరో నాయకుడు దాడి వీరభద్రరావు ఇప్పటికే వైసీపీలో చేరారు. కొణతాల కూడా వైసీపీలో చేరనున్నారనే వార్తలతో రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి విశాఖ జిల్లాలో నెలకొంది.
Tags:Former minister Konstala Ramakrishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *