యూత్ ఫుల్ సినిమాలో మాజీ మంత్రి పల్లె

హైదరాబాద్ ముచ్చట్లు:


చూడు కమిషనర్ నేను టై వేసుకున్నంత వరకే కలెక్టర్.. టై తీశానంటే టైగర్.. ఈ డైలాగ్ వింటుంటే బాలయ్య బాబు చెప్పినట్టు ఉంది కదా.. అలా అనుకుంటే మీరు పొరబడినట్టే.. ఈ డైలాగ్ చెబుతోంది ఒక మాజీ మంత్రి.. సీనియర్ పొలిటీషియన్. అందునా రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో పంచ్ డైలాగ్ లతో అదరగొడుతున్నారు. ఇంతకీ ఎంతో సీనియర్ అయిన ఆయన సినిమా ఏంట్రీకి కారణం ఏంటంటే.. గతంలో ఆయన ఫ్యాన్స్ హీరోలా ఉన్నావని చెప్పారట.. దీనికి తోడు అనుకోకుండా అవకాశం రావడంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారట. లేటు వయసులో ఫేస్‌కు మేకప్‌ వేసుకున్న ఈ మాజీ మంత్రి ఎవరో తెలుసుకుందాం..పల్లె రఘునాథ్ రెడ్డి. అనంతపురం జిల్లా రాజకీయాల్లో సుధీర్ఘ అనుభవం ఉన్న నేత.

 

 

 

మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేసిన ఆయనలో ఇది మరో కోణం అన్నమాట.. అంతేకాదు.. విద్యాసంస్థల అధినేతగా కూడా ఆయన సుపరిచితమే.  అందుకే పల్లె రఘునాథ్‌ రెడ్డిని చాలామంది సార్‌ అని.. మరింత దగ్గరైనవాళ్లు అయ్యవారు అని పిలుస్తారు. ఆయన అందరిలాంటి రాజకీయ నేత కాదు.. సాధారణంగా పొలిటికల్‌ లీడర్లు ఓ స్థాయికొచ్చాక.. వాళ్ల ప్రవర్తనే వేరుగా ఉంటుంది. కానీ.. పల్లెలో అలాంటి యాంగిల్‌ కనిపించదు. కొత్తైనా పాతైనా అందరితో కలిసిపోతారు. నవ్వుతూ మాట్లాడుతుంటారు.ఇక పబ్లిసిటీలోఅయితే..పల్లె.. రామ్‌గోపాల్ వర్మను గుర్తు తెస్తుంటారు. మంత్రిగా ఉన్న టైమ్‌లో కూడా పల్లె చేసిన కొన్ని పనులు నవ్వు తెప్పించాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే డ్రస్సింగ్ స్టయిల్‌ , ఇంకొకటి మంత్రిగా ఉన్న సమయంలో బహిరంగంగా షర్ట్ ఫ్యాంట్ తీసి చెరువుల్లో ఈత కొట్టడం, కూలీలా పని చేయడం ఇలా చెబుతూ పోతే పల్లె వేషాలు చాలానే ఉన్నాయి. ఎక్కడికెళ్లినా.. తనే అట్రాక్షన్‌గా ఉండేలా చూసుకుంటారు.

 

 

 

మైకు అందుకుంటే గంటలు నిమిషాలవుతాయన్నమాట.ఇప్పటివరకు ఇలా కనిపించిన పల్లె ఇప్పుడు మూడో అవతారం చూపిస్తానంటున్నారు. అదే..యాక్టింగ్‌.. అనంతపురం జిల్లాకు చెందిన కూరగాయల లక్ష్మీపతి అనే నిర్మాత..ఐక్యూ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సినిమా ఇది. పల్లె సార్‌కు చాలా పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి కదా. సినిమా కోసం కాలేజీలు అడిగారు దర్శక నిర్మాతలు. అలాగే ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర ఉందని.. దానికి మీరు సూట్ అవుతారని చెప్పగా..పల్లె రెడీ అని వెంటనే ఒప్పుకున్నారు. ఇందులో పల్లె రఘునాథరెడ్డి జిల్లా కలెక్టర్‌గా పవర్‌ ఫుల్‌ రోల్‌ చేయబోతున్నారట. ఇందుకు సంబంధించి సీన్లు కూడా పూర్తయ్యాయి.ఇందులో మన పల్లె చెప్పిన తొలి డైలాగ్ ఏంటంటే.. చూడు కమిషనర్ నేను టై కట్టుకున్నంత వరకే కలెక్టర్.. టై తీస్తే టైగర్ అని.. ఈ సినిమాలో కమిషనర్ గా సుమన్‌ సహా.. పలువురు ప్రముఖ నటీనటులు ఉన్నారట. గతంలో పల్లె ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు అమెరికా వెళ్లారు. అక్కడి తెలుగువారు..మీరు హీరోలా ఉన్నారు సార్‌..సినిమాల్లో ఎందుకు నటించకూడదని అన్నారట. ఆ ముక్క సారు బుర్రలో బాగా పాతుకుపోయింది. ఇంతకాలానికి అనుకోకుండా అలాంటి అవకాశం రావడంతో..రెండో మాట లేకుండా  ఒప్పుకున్నారు. మరి ఇప్పటికే విద్యావేత్తగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన పల్లె ఇప్పుడు నటుడిగా కూడా కనిపించబోతున్నారు.

 

Tags: Former Minister Palle in the movie Youthful

Leave A Reply

Your email address will not be published.