సిబిఐ ముందు హజరయిన మాజీమంత్రి సోమిరెడ్డి
నెల్లూరు ముచ్చట్లు:
చెన్నై నుండి వచ్చిన సిబిఐ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అధికారుల ముందర హాజరై 1.10 నిమిషాలు అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లలోని ఉపహార్ కేసు కన్నా ఈ ఫైళ్ళ మాయం కేసు సీరియస్. డూప్లికేట్ డాక్యుమెంట్స్ చేయడం చాలా దారుణమైన నేరం. నాకు నా కుటుంబ సభ్యులు కు 4 దేశాల్లో ఆస్తులు ఉన్నట్టు ఆరోపణ చేయడం నా వ్యక్తిగతంగా నాకు నా కుటుంబానికి ఎంతో అప్రతిష్ట. కోర్టులో వున్న సాక్ష్యాలు కనిపించకుండా పోతే న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి. ఈ నేరానికి పాల్పడ్డ వారు ఎవరూ తప్పించుకోలేరని అన్నారు.
దొంగలు దొంగతనం కోసం కోర్టు లోపలకు వెళ్ళడం అక్కడ కుక్కలు అరవడం దొంగలు కోర్టు లోపలికి వెళ్ళడం అక్కడ ఎన్నో ఫైళ్లు వున్నా అవన్నీ తాకకుండా కేవలం ఈ కేసులో ఫైళ్లు మాత్రం పోవడం అంతా పెద్ద మిస్టరీ. సుప్రీం కోర్టు లో కేసు హియరింగ్ కు వస్తున్న సందర్భంలోనే ఈ ఫైల్స్ మాయంకావడం లో ఆంతర్యం ఏమిటి. లిక్కర్ కుంభకోణం కేసులో ప్రధాన ముద్దాయి ల్లో ఒకరైన అప్పు అనే వ్యక్తి జైల్లో నే చనిపోవడం కూడా మిస్టరీనే. సిబిఐ అధికారులు విచారణ లో బాగంగా ఇంకో మూడు రోజుల్లో నన్ను రిటర్న్ గా స్టేట్ మెంట్ ఇవ్వమన్నారు. జిల్లా ఎస్పీ విజయ రావు ఈ కేసు వివరాలు చెప్పినట్టు గంజాయి తాగి ఫుట్ పాత్ ల మీద పడుకునే వారు, ఈ డాక్యుమెంట్లే దొంగతనం చేయడం హాస్యాస్పదంగా తెలుస్తుంది. ప్రిన్సిపల్ జడ్జి 250 పేజీలతో ఒక నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో నెల్లూరు జిల్లా పోలీసు ఈ కోర్టు లో చోరీ కేసులో పింగర్ ప్రింట్స్ కానీ మరి కొన్ని సాధారణ ఆధారాలు సేకరించ లేదని చెప్పిందంటే పోలీసులు కేసును ఏ విధంగా విచారించారో అర్దం అవుతుందని అయన అన్నారు.

Tags; Former minister Somireddy appeared before CBI
