తూర్పుపాలెంలో మాజీ మంత్రి పర్యటన
పెనుమంట్ర ముచ్చట్లు:
ప్రతీ పేదవానికి సొంతింటి కల నెరవే ర్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీని నిరంతరంగా కొన సాగిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పోడూరు మండలం తూర్పుపాలెంలోని మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు కార్యాలయంలో ఆచంట వేమవరం గ్రామానికి చెందిన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆచంట నియోజకవర్గంలో పెనుగొండ, పోడూరు , పెనుమంట్ర,ఆచంట మండలాలకు చెందిన లబ్దిదారులకు రూ.11 లక్షల విలువైన సీఎం రిలీఫ్ చెక్కులను మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పంపిణీ చేశారు. పెనుగొండ మండలం తామరాడ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం. కార్యక్రమం నిర్వహించారు. తామరాడ లో బీసీ కమ్యూనిటీ హాలు పై అంతస్తు భవన నిర్మానానికి నిధులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రం భవన సమస్యను సత్వరం పరిష్కరిస్తామన్నారు.
విడతల వారీగా డ్రెయినేజీ, రహదారుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఇచ్చిన ప్రతీ హామీని నియోజకవర్గంలో అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమం అమలులో పార్టీ, వర్గ, కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రతీ ఒక్కరీ అందేలా చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. గతంలో జన్మభూమి కమిటీల చుట్టూ ప్రదిక్షణలు చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు అర్హత ఉంటే చాలు వాలంటీర్లు ఇంటి ముంగి టకు వచ్చి పథకాన్ని అందిస్తున్నారన్నారు. పేదల, సంక్షేమం కోసం సీఎం జగన్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బొక్కా అరుణ, జక్కంశెట్టి చంటి, పోతుమూడి రామ చంద్రరావు,వైట్ల కిషోర్ , కోట వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు..

Tags: Former minister’s visit to East Palem
