మాజీ ఎమ్మెల్యే అందోళన

కర్నూలు ముచ్చట్లు :
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామంలో బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇళ్లను   పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ పరిశీలించారు.. అయితే అంతకుముందు  బ్లాస్టింగ్ జరిగే ప్రదేశానికి వెలుతుండగా  రోడ్డుకు అడ్డంగా  పోలీసులు బారికేడ్లు  అడ్డుకున్నారు..దింతో  వారు, రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు..చివరకు స్టీల్ ప్లాంట్ సందర్శించడానికి  పోలీసులు ఒప్పుకున్నారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుట్టపాడు గ్రామంలో నిర్మిస్తున్న జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ లో  ఓపెన్ బ్లాస్టింగ్  జరగుతుండతో గ్రామంలో  ఇల్లు కంపిస్తున్నాయని గోడలు నెర్రలు వస్తుండంతో ప్రజలు తీవ్ర భయాందోళన  చెందుతున్నారన్నారు. ఓపెన్ బ్లాస్టింగ్ చేయడం వలన గ్రామ శివార్లలో ఉన్న పంట పొలాల్లోకి రాళ్లు ఎగిసిపడడంతో పంట పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు కూలీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.  చెరువు నిర్మాణం కోసం ఈ బ్లాస్టింగ్ చేస్తున్నారని, ఓపెన్ బ్లాస్టింగ్ కాకుండా కంట్రోల్ ప్లాస్టింగ్ చేయాలన్నారు. తాము ఇక్కడికి రాజకీయాలు చేయడానికి రాలేదని దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించడానికి  మాత్రమే వచ్చామని అయితే పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం దారుణమన్నారు. మేము అభివృద్ధి కి వ్యతిరేకం కాదని  తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఈ పరిశ్రమ ఎక్కడికి వచ్చిందని,  నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, బ్లాస్టింగ్ వల్ల ఇల్లు  దెబ్బతినకుండా చూడాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. అధికారులు గుట్టపాడు లోని బ్లాస్టింగ్ జరిగే ప్రాంతాన్ని సందర్శించి  ప్రజలకు న్యాయం చేయాలన్నారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Former MLA concern

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *