Natyam ad

మాజీ ఎమ్మెల్యే గృహనిర్భందం

వికారాబాద్ ముచ్చట్లు:
 
వికారాబాద్ జిల్లా  పరిగి లొ మాజీ ఎమ్మెల్యే  రామ్మోహన్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేసారు.  కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు. ఎంపి  రాహుల్ గాంధీ పై అస్సాం ముఖ్యమంత్రి హేమంత్
బిస్వా శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అస్సాం ముఖ్యమంత్రి పై ఎఫ్ఐఆర్  నమోదు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంప్లెట్ చేశారు.  కానీ ఇప్పటి వరకు
ఎఫ్ఐఆర్  చేయడం లేదు. దాంతో టీపీసీసీ  అద్యక్షులు రేవంత్ రెడ్డి  పిలుపు మేరకు బుధవారం అన్నీ జిల్లాల ఎస్పీ ఆఫీస్ల ముందు ధర్నా చేయాలని నిర్ణయించారు.  అస్సాం ముఖ్యమంత్రి పై కేసు
నమోదు చేయాలని డిమాండ్ తో బయలుదేరుతున్న మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని పరిగి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసినా అస్సాం సీఎం ను అరెస్టు
చేసే వరకు పోరాడుతామని అయన తెలిపారు.
 
Tags:Former MLA house arrest