మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్‌బుక్ పేజ్ హ్యాక్

Former MLA Rajasinghe Facebook Page Hack

Former MLA Rajasinghe Facebook Page Hack

Date:08/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
గోషామహల్ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్‌బుక్ పేజ్ హ్యాక్ అయ్యింది. సోమవారం తన ఫేస్‌బుక్ పేజ్ హ్యాక్ అయ్యిందంటూ ఆయన మంగళహాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తర్వాత సైబర్ క్రైమ్ డీసీపీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. పేజ్‌ను హ్యాక్ చేసి తనను అడ్మిన్‌గా తొలగించారని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.ఫేస్‌బుక్ పేజ్‌ను విదేశాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారని చెబుతున్నారు రాజాసింగ్. గతంలో కూడా తన వెబ్‌సైట్, ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసే ప్రయత్నం జరిగిందన్నారు. అది కుదరక ఫేస్‌బుక్‌ను టార్గెట్ చేసి హ్యాక్ చేశారంటున్నారు. ఈ పేజ్ నుంచి ఏదైనా తప్పుడు సందేశాలు వస్తే తమ బాధ్యత కాదన్నారు. పేజ్‌లో దాదాపు 5లక్షల 35వేలమంది ఫాలోవర్స్ ఉన్నారంటున్నారు రాజాసింగ్.
Tags:Former MLA Rajasinghe Facebook Page Hack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *