Natyam ad

టిడ్కో ఫ్లాట్ల ప్రారంభోత్సవం వాయిదాపై మాజీ ఎమ్మెల్యే రావి ఆగ్రహం

గుడివాడ ముచ్చట్లు:


గుడివాలో టిడ్కో  ప్లాట్ల ప్రారంభోత్వం వాయిదా పడడంపై మాజీ ఎమ్మెలయే రావి వెంకటేశ్వరరావు మండిపడ్డారు.  పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నా కొడాలి నాని, వైసిపి ప్రభుత్వానికి, పేదల ఉసురు తగులుతుంది. నాలుగేళ్లుగా కళ్ళు కాయలు కాసెలా ఎదురుచూస్తున్న పేదలను ఇంత మోసం చేస్తారా. చిటీ పాటల మాదిరి ఫ్లాట్ల ప్రారంభోత్సవాన్ని ఒకటోసారి ,రెండోసారి , మూడోసారి అంటూ వాయిదాలు వేస్తున్నారు. నేనెంత  చెబితే జగన్ కు అంతే అంటూ సొల్లు కబుర్లు చెప్పే కొడాలి నాని ఇప్పుడేం సమాధానం చెబుతాడని అన్నారు. టిడిపి హయాంలో 80శాతం పూర్తి చేసిన ఇళ్లను ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నారు. అధికారులు మోసపోవద్దు….వ్యవస్థను అనుసరించాలి. చంద్రబాబు కష్టం, వెంకయ్య నాయుడు సహకారంతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకుంది. మా కష్టం నాశనం అవుతుందని రోజు మొత్తుకుంటున్న,  చివరికి జరిగిందెంటి. ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించండి. 9నెలలు ఓపిక పడితే, సీఎం హోదాలో చంద్రబాబు చేతుల మీదుగా ఫ్లాట్లను అప్పగిస్తామని అన్నారు.

 

Tags; Former MLA Ravi angry over the postponement of the opening ceremony of Tidco flats

Post Midle
Post Midle