Natyam ad

మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పనికిమాలిన విమర్శలు మానుకోవాలి – డిప్యూటి మేయర్ ముద్ర నారాయణ

తిరుపతి ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధారమైన ఆరోపణలు చేయడం పై నిప్పులు చెరిగిన YSRCP నాయకులు.తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి మాస్టర్ ప్లాన్ రోడ్లపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ రోడ్లను వైసీపీ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసమే అంటూ అభివృద్ధి నిరాధారమైన ఆరోపణలు చేయడం హేయమైన చర్యగా ముద్ర నారాయణ పేర్కొన్నారు,మాస్టర్ ప్లాన్ లతో నగర ప్రజలకు ఒరిగింది ఏమి లేదు అంటున్నారు ఒకసారి పూర్తి ఆయిన మాస్టర్ ప్లాన్ రోడ్లను ఉపయోగించుకుంటున్న నగర ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని తరువాత విమర్శలు చేస్తే మంచిదని అలా కాకుండా రాజకీయ ప్రయోజనాలకోసం విమర్శలు చేయకూడదని హితవు పలికారు.మాస్టర్ ప్లాన్ రోడ్ల వలన ప్రజలకు ఉపయోగమే కాకుండా, కార్పొరేషన్ కు కూడా అధిక ఆదాయం వస్తుందని తద్వారా నగర అభివృద్ధికి ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు.తిరుపతి అభివృద్ధి పైన బహిరంగ డిబేట్ కు మేం సిద్దం – SK బాబు.నగరంలో గత నలభై ఏళ్లుగా మరుగున పడిన అభివృద్ధికి చెందిన కార్యక్రమాల తాలుఖ ఫైళ్ల దుమ్ము దులిపేసిన దమ్మున్న నాయకుడు భూమన అభినయ్ రెడ్డి  అని అన్నారు, ఏ ప్రభుత్వం చేయనంత అద్భుత రీతిలో భూమన అభినయ్ చేపడుతున్న అభివృద్ధికి నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ ఓర్వలేక నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో దొరైరాజు , నల్లని బాబు ,JCS అధ్యక్షుడు బాలిశేట్టి కిషోర్ , మద్దాలి శేఖర్ రాయల్ ,పసుపులేటి సురేష్ , మోహన్  తదితరుల పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Former MLA Sugunamma should avoid useless criticism – Deputy Mayor Mudra Narayana

Post Midle