రాజకీయ లబ్ధికోసం మాజీ ఎంపి రామక్రిష్ణారెడ్డి కుటుంబాన్ని విడగొట్టింది అనీషారెడ్డి

Former MP MP Ramkrishna Reddy breaks up family

Former MP MP Ramkrishna Reddy breaks up family

– మనోవేదనతోనే రామక్రిష్ణారెడ్డి మరణం
– పదేళ్లుగా మదనపల్లెలో కాపురం
– బీసి దేశం నేత రాజుకు ఓటు వేశావా…?
– లోకేష్‌ పర్యటనలో దేశం బ్యానర్లు చించలేదా..?
– శిఖండి పాత్ర పోషించకండి
– జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రిదేవి ఫైర్‌

Date:04/12/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు తెలుగుదేశం పార్టీకి ఇన్‌చార్జ్గా ఉన్న అనీషారెడ్డి తన మామ మాజీ ఎంపి రామక్రిష్ణారెడ్డి కుటుంభాన్ని రాజకీయ లబ్ధికోసం విడగొట్టి, మదనపల్లెలో కాపురం పెట్టి, రామక్రిష్ణారెడ్డి మరణానికి కారణమైన నీకు పెద్దిరెడ్డి కుటుంభాన్ని విమర్శించే అర్హత ఉందా..? పదేళ్లు తెలుగుదేశం పార్టీకి సేవలు చేసిన బిసి నేత వెంకటరమణరాజు కనీసం ఓటు వేశారా..? నీవు శిఖండి పాత్రలు పోషించకుండ మహిళల గౌరవానికి భంగం కలిగించవద్దు…జాగ్రత్త అంటు వైఎస్‌ఆర్‌సిపి జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రిదేవి మంగళవారం అనీషారెడ్డిపై మండిపడ్డారు. మున్సిపాలిటిలో వైఎస్‌ఆర్‌సిపి గడపగడపకు కార్యక్రమానికి ఆమె హాజరైయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనీషారెడ్డి కెళవాతిలో తన మామ మాజీ ఎంపి రామక్రిష్ణారెడ్డి, మంత్రి అమరనాథరెడ్డి కుటుంబంలో విబేదాలు తీసుకొచ్చి, మదనపల్లెలో వేరు కాపురం పెట్టిందన్నారు. అనీషారెడ్డి ప్రవర్తనతో మనోవేదనకు గురై రామక్రిష్ణారెడ్డి మరణించారని ఆమె ఆరోపించారు. పెద్దలను , భర్తను గౌరవించడం చేతకానీ అనీషారెడ్డి శిఖండి పాత్రలు పోషిస్తూ , మహిళల గౌరవాన్ని మంటగలుపుతున్నారని మండిపడ్డారు. పుంగనూరు ప్రజలపై రౌడీయిజం, ఫ్యాక్షనిజం చేస్తామనడం ఆమె అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. శాంతియుతమైన పుంగనూరు ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా అనీషారెడ్డి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ముప్పె సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలందించామని చెబుతున్న అనీషారెడ్డి ఏనాడు పార్టీకి పనిచేయలేదన్నారు. మంత్రి అమరనాథరెడ్డి ఎదుగుదలను చూసి సహించలేక ప్రజారాజ్యం పార్టీలో టికెట్టు కోసం ప్రాకులాడి టికెట్టు రాకపోవడంతో తిరిగి తెలుగుదేశం పార్టీ అంటు గొప్పలు చెప్పుకోవడానికి నోరేలా వచ్చిందంటు మండిపడ్డారు. రెండు సార్లు పుంగనూరు టికెట్టును బిసి నాయకుడు వెంకటరమణరాజుకు అధిష్టానం ఇచ్చిందని కోపంతో లోకేష్‌ పర్యటనలో బ్యానర్లు చించి , ధర్నాలు చేసింది మీరు కదా..? కనీసం తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకునే మీరు వెంకటరమణరాజుకు ఓటు వేశారా అంటు నిలధీశారు. అనీషారెడ్డికి రాజకీయాల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అధికారం లేకపోయినా , ప్రభుత్వం నిధులు నివ్వకపోయినా సొంత నిధులు ఖర్చు చేస్తూ , పుంగనూరు ప్రజల అభిమానాన్ని సంపాదించారన్నారు. అనీషారెడ్డి ఏనాడైనా సేవా కార్యక్రమాలు కానీ, ఒక్క రూపాయి ఖర్చు చేశారా చెప్పడంటు నిలధీశారు. పుంగనూరులో ఇష్టం వచ్చినట్లు ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం , పెద్దికుటుంభాన్ని విమర్శించడం చేస్తే చూస్తూ ఊరుకోం జాగ్రత్త … నోరు అదుపులో పెట్టుకో….లేదా తగిన మూల్యం చెల్లించకతప్పదు అంటు గాయత్రిదేవి హెచ్చరికలు చేశారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సిపి జిల్లా మైనార్టీ మహిళా విభాగం కార్యదర్శి రేష్మా, కౌన్సిలర్‌ మంజుల, మహిళా నాయకురాళ్లు తులసెమ్మ, షకీల, రషీద, అమరావతమ్మ తదితరులు పాల్గొన్నారు.

జగన్మోహన్‌రెడ్డికి జన నీరాజనం

 

Tags;Former MP MP Ramkrishna Reddy breaks up family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *