మాజీ రాష్ట్రపతి అబ్ధుల్‌ కలామ్‌కు విద్యార్థుల సలామ్‌

Former President Abdul Kalam Students Salam

Former President Abdul Kalam Students Salam

– వాడవాడల జయంతి వేడుకలు

Date:15/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

భారతరత్న అవార్డు గ్రహీత, మాజీ రాష్ట్రపతి, భరతమాత ముద్దుబిడ్డ ఏపిజె అబ్ధుల్‌కలామ్‌ 89వ జయంతి వేడుకలను మంగళవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివేకానంద యువజన సంఘం సభ్యులు గిరిధర్‌, ఇంతియాజ్‌, సతీష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈవో కేశవరెడ్డి అబ్ధుల్‌ కలామ్‌ చిత్రపటానికి విద్యార్థులతో కలసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. అలాగే బిఆర్‌ హైస్కూల్‌లో విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించి, బహుమతులు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని కొత్తయిండ్లు హైస్కూల్‌లో కలామ్‌ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. వీరితో పాటు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు కలామ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, బహుమతులు పంపిణీ చేశారు. ఈ సమావేశాలలో వివేకానంద యువజన సంఘ సభ్యులు వినాయక, కుమార్‌, హరి, సతీష్‌, విజయ్‌, వెంకటకృష్ణ, మహేష్‌, రాజేష్‌, గంగాధర్‌, దేవిక , విశ్రాంత హెచ్‌ఎం వెంకటపతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పోలీసుల సంస్మరణ దినోత్సవం

Tags: Former President Abdul Kalam Students Salam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *