Natyam ad

ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి

మంథని ముచ్చట్లు:


భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ  38 వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షులు సెగ్గం రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు సోమవారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గరీబీ హటావో అంటూ దేశంలో పేదరిక నిర్మూలన కోసం పని చేసిన తొలి మహిళా ప్రధాని అని కొనియాడారు. జాతీయ భద్రత ,ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానానికి  చేసిన సేవలు మరువలేనివి అన్నారు. రాజభరనాలు రద్దుబ్యాంకులు జాతీయకరణ అరిజన గిరిజనులకు భూమి పంపిణీ చేశారన్నారు. బలహీన వర్గాలకు గృహ సముదాహిని,  బడి ఈడు పిల్లలు చదువుకోవాలి,చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చిందన్నారు.

 

 

ఇందిరా గాంధీ  మహిళ లోకానికి  స్ఫూర్తి అని, ఇందిరా గాంధీ  దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత అన్నారు. దేశం ఇందిరా గాంధీ గారిని చూసి  గర్వపడుతుందని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో నాయకులు  శశి భూషణ్ కాచే, పెరవెని లింగయ్య యాదవ్, పేండ్రు రమ దేవి, రావికంటి సతీష్, మంథని సత్యం, గోటికారి కిషన్ జి, కుడుదల వెంకన్న,బండారి ప్రసాద్, మంథని రాకేష్, మద్దెల రాజయ్య, ముసుక్కుల సురేందర్ రెడ్డి, అయీలి ప్రసాద్, లైశెట్టి రాజు, మంథని శ్రీనివాస్, దోనగోర్ల శ్రీనివాస్ యాదవ్, తంగళ్ళపల్లి జగదీష్, పర్శావేన మోహన్, కుడుదుల మహదేవ్, అరెంద సత్యనారాయణ రెడ్డి, పొనగంటి రమేష్, నరెడ్ల కిరణ్, నాగుల రాజయ్య,పెరుగూ తేజ, గాజులు నిఖిల్, అబ్దుల్ అలీమ్, రవి, ఇందారపు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Former Prime Minister Indira Gandhi’s death anniversary

Post Midle

Leave A Reply

Your email address will not be published.