బార‌తజాతి ముద్దు బిడ్డ మాజీ ప్ర‌ధాని వి.వి. న‌ర‌సింహ‌రావు శ‌త జ‌యంతి

మ‌చిలీప‌ట్నం ముచ్చట్లు :

 

బార‌తజాతి ముద్దు బిడ్డ, బ‌హుబాష కొవిధులు మాజీ ప్ర‌ధాని వి.వి. న‌ర‌సింహ‌రావు శ‌త జ‌యంతి సంద‌ర్భంగా మ‌చిలీప‌ట్నం తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆయ‌న‌కు ఘ‌న నివాళుల‌ర్పించారు. ఏపీ బ్ర‌హ్మ‌ణ కార్పోరేష‌న్ కృష్ణ‌జిల్లా మాజీ ఆర్గ‌నైజ‌ర్ పి. వి ఫ‌ణికుమార్ ఆధ్వ‌ర్యంలో మున్పిప‌ల్ ప్ర‌ధాన పార్క్ ప‌క్క‌న గ‌ల పి. వి న‌ర‌సింహ‌రావు విగ్ర‌హానికి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యులు కొల్లు ర‌వీంద్ర, మ‌చిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్య‌క్షులు, మాజీ ఎంపి కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, ఇత‌ర నాయ‌కులు పూల‌మాల‌లు వేసి ఘ‌నంగానివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర, మాజీ ఎంపి కొన‌క‌ళ్ల నారాయ‌ణ మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి దేశానికే వ‌న్నే తెచ్చినా నాయ‌కులు పి.వి న‌ర‌సింహ‌రావు అని కొనియాడారు. ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా, దేశానికి ప్ర‌ధాన మంత్రిగా దేశానికి ఆయ‌న విశేష సేవ‌లు అందించార‌ని తెలిపారు.

 

 

 

 

పి.వి న‌ర‌సింహ‌రావు ఆంద్ర‌ప్ర‌దేశ్ లో పొటి చేస్తే నంద‌మూరి తార‌క రామ‌రావు ఆయ‌న‌కు పొటి పెట్ట‌కుండా పి.వి న‌ర‌సింహ‌రావుకి బాస‌ట‌గా నిలిచార‌ని గుర్తు చేశారు. తెలుగువారి కీర్తీని ప్ర‌పంచానికి చాటిన నాయ‌కులు నంద‌మూరి తార‌క రామ‌రావు అయితే తెలుగువారి నైపుణ్యాన్ని ప్ర‌పంచానికి చాటిన వ్య‌క్తి పి.వి న‌ర‌సింహ‌రావు అని పేర్కొన్నారు. ప్ర‌పంచంతో నేడు మ‌న దేశం పొటి ప‌డుతుందంటే ప్ర‌ధాన మంత్రిగా దేశంలో ఆయ‌న తీసుకువ‌చ్చిన ఆర్ధిక సంస్క‌ర‌ణ‌ల వ‌ల్లేన‌న్నారు. తెలుగు జాతికి చెందిన నాయ‌కులు దేశ ప్ర‌ధాని అవ్వ‌డం మనందరికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. తెలంగాణ‌లో పి.వి శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను పెద్ద ఎత్తును ఘ‌నంగా నిర్వ‌హిస్తుంటే ఆంద్రప్ర‌దేశ్ లో మాత్రం వైసీపీ ప్ర‌భుత్వం ఆయ‌న జ‌యంతిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తెలుగుజాతి గ‌ర్వించే నాయ‌కులు పి.వి న‌ర‌సింహ‌రావు అని తెలిపారు. పి.వి ఆశ‌యాల‌ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్య‌త దేశ ప్ర‌జ‌లంద‌రిపై ఉంద‌న్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పి.వి న‌ర‌సింహ‌రావు ఖ్యాతిని తెలుసుకోవాల‌న్నారు.

 

 

 

ఏపీ ప్ర‌భుత్వం కూడా పి.వి శ‌త జ‌యంతి ఉత్స‌వాలను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ మోట‌మ‌ర్రి బాబా ప్ర‌సాద్, మాజీ వైస్ చైర్మ‌న్ పంచ‌ప‌ర్వాల కాశీ విశ్వ‌నాథం, మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ మ‌హిళా అధ్య‌క్షురాలు లంకిశెట్టి నీర‌జా, తెలుగు మ‌హిళా నాయ‌కురాలు కారెడ్ల సుశీల‌, బ్ర‌హ్మ‌ణ సంఘం మ‌హిళా నాయ‌కురాలు ఆంబ‌టిపూడి నాగ‌ల‌క్ష్మీ, టీడీపీ నాయ‌కులు కాసాని భాగ్య‌రావు, గుమ్మ‌డి విద్యా సాగ‌ర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు చిట్టూరి యువ‌రాజ్, బొడ్డు నాగ‌రాజు, లీగ‌ల్ సెల్ జిల్లా అధ్య‌క్షులు పుప్పాల ప్ర‌సాద్, గొకుల్ శివ‌, సీత‌రామ‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags: Former Prime Minister V.V. Narasimha Rao Centenary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *