ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌ కన్నుమూత

Former Secretary General of the United Nations Kofi Annan passed away

Former Secretary General of the United Nations Kofi Annan passed away

Date:18/08/2018
న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:
ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్‌, నోబెల్‌ శాంతి బహుమతి పురస్కార గ్రహీత కోఫీ అన్నన్‌ కన్నుమూశారు. ఆఫ్రికా ఖండం నుంచి ఐరాసకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు. జనవరి 1, 1997 నుంచి డిసెంబరు 31, 2006 వరకూ పదేళ్ళపాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు.
ఘనాలోని కుమాసిలో జన్మించిన అన్నన్‌ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1961లో డిగ్రీ, 1972లో మేనేజ్‌మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. 1962లో బడ్జెట్ అధికారిగా అన్నన్ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించారు. 1987-92 కాలంలో సహాయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
1997లో తొలిసారి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బౌత్రోస్ బౌత్రోస్‌ ఘలీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు ఉదయం అస్వస్థతకు గురైన అన్నన్‌ను ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
Tags:Former Secretary General of the United Nations Kofi Annan passed away

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *