టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

బనగానపల్లె ముచ్చట్లు :

బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో జనార్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి ఘటనలో ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ దాడి ఘటనలో ప్రధాన నిందితుడు జనార్ధన్‌రెడ్డితో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: Former TDP MLA arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *