నవంబర్ 22 నుంచి విజయవాడలో ఫార్ములా వన్ రేస్

Formula One race in Vijayawada since November 22

Formula One race in Vijayawada since November 22

 Date:14/07/2018
విజయవాడ ముచ్చట్లు:
అమరావతికి ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు, ఫార్ములా1 పవర్‌బోట్‌ రేసింగ్‌, కృష్ణా నదిలో జరగనున్న విషయం తెలిసిందే. పోటీల నిర్వహణ సంస్థ యూఐఎం రాష్ట్ర పర్యాటక శాఖతో ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో ఒప్పందం చేసుకోనుంది. షెడ్యూల్‌ ప్రకారం ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ పోటీలు నవంబరు 22-24వరకు జరగాల్సి ఉంది. తాజాగా ఈ షెడ్యూల్‌లో మార్పు చేశారని, నవంబరు 10నుంచే ఇక్కడ పోటీలు ప్రారంభమవుతాయని అంటున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే ఒక బోటుకు నవ్యాంధ్ర రాజధాని అమరావతి థీమ్‌తో నమూనాను సిద్ధం చేశారు. థీమ్‌లో భాగంగా లేత పసుపురంగు బ్యాక్‌గ్రౌండ్‌ పైన ఎరుపు రంగులో ‘అమరావతి’ పేరు, దాని కింద ఏపీ టూరిజం అని రాసి ఉంటుంది. 2018 వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో భాగంగా ఎఫ్‌1 వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహణ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 8 మహానగరాల్లో వీటిని నిర్వహిస్తుంది. పోర్చుగల్‌, లండన్‌, ఫ్రాన్స్‌, చైనా, దుబాయ్‌తో పాటు ఈసారి భారత దేశంలోని, అమరావతి కూడా చోటు కల్పించారు. మే నెల 18న పోర్చుగల్‌లో మొదలైన ఈ చాంపియన్‌షిప్‌ డిసెంబరు 15న షార్జాలో ముగుస్తుంది.ఈ ‘ఎఫ్‌1హెచ్‌2వో’ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌, మన రాష్ట్రానికి తీసుకురావటానికి చంద్రబాబు గత ఏడాది నుంచి, ఎంతో శ్రమించారు… ఎఫ్‌1హెచ్‌2వో ప్రతినిధులతో ఏడాది వ్యవధిలో నాలుగుసార్లు చర్చించారు. .. బ్యారేజీ నుంచి నది 23కి.మీ. మేర ఉండడం, 11 లంకలు(ఐలాండ్‌లు), అక్కడక్కడా నది వంపులు, నీటిలో అలలు లేకుండా నిర్మలంగా ఉండడం వంటి సాంకేతిక కారణాలను పరిశీలించి ఈ ప్రాంతాన్ని రేసింగ్‌కు అనువైనదిగా గుర్తించారు…. ‘ఎఫ్‌1హెచ్‌2వో’ ప్రతినిధి బృందంతో, ఈ రేస్‌లు అమరావతిలో నిర్వహిస్తే రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందని, ప్రపంచ స్థాయిలో మా కొత్త నగరానికి గుర్తింపు వస్తుందని చంద్రబాబు కోరారు. సాంకేతికంగా కూడా అనువుగా ఉండడంతో ఈ ఏడాది ఛాంపియన్‌షిప్‌ కేలెండర్‌లో అమరావతిని వేదికగా ఎంపిక చేశారు… ఇక నవంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా, అంతర్జాతీయ పర్యాటకులు, క్రీడాభిమానులు, పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు ఇలా అనేకమంది రాకతో నవంబరులో విజయవాడలో సందడి నెలకొననుంది.
నవంబర్ 22 నుంచి విజయవాడలో ఫార్ములా వన్ రేస్ https://www.telugumuchatlu.com/formula-one-race-in-vijayawada-since-november-22/
Tags:Formula One race in Vijayawada since November 22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *