Natyam ad

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నంద్యాల ముచ్చట్లు:

వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గంలో అభివృద్ధి కి చర్యలు చేపట్టినట్లు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని నేషనల్ కర్నూలు కడప హైవే బొమ్మల సత్రం ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జి  వరకు 2.5 కిలోమీటర్లు  వరకు 13 కోట్ల 40 లక్షల రూపాయల తో రోడ్డు వైడింగ్ చేసి రెండు సైడ్లు డ్రైను నిర్మించడం జరుగుతుందన్నారు. బుధవారం నాడు పనులను  ప్రారంభించారు. ముఖ్యంగా కలెక్టర్ కార్యాలయం ఉండడంతో అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం ప్రజల  రద్దీ పెరగడంతో రోడ్డు వెడల్పు చేయడం జరుగుతుందన్నారు. రోడ్లు పూర్తి అయితే ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుందని పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. మధ్యలో బొగ్గులైన్ నివాసితులకు ఆల్ట్రానెట్ నివాసాలు కూడా చూపించడం జరిగిందని వారికి ఇచ్చిన నివాసలు కూడా త్వరగా  పూర్తి చేసి వారికి అందజేయలని అధికారులను కోరారు. కార్యక్రమంలో ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి. కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ వైయస్ అర్ సీ పీ నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

 

Tags: Foundation laying of development works

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.