హత్య కేసులో నలుగురు ముద్దాయిలకు యావత్జీవ కఠిన కారాగార శిక్ష – జరిమానా.

తిరుపతి  ముచ్చట్లు:

 

తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసులో శిక్ష ఖరారు.పాత కక్షల కారణంగా బాధితులపై విచక్షణ రహితంగా చేతులతో కొట్టి, కాళ్లతో తన్ని తీవ్రంగా గాయపరిచి హత్య చేసిన ముద్దాయిలు.మెరుగైన ఫలితాలను ఇస్తున్న ప్రయారిటి PT కేసుల (కన్వెన్షన్ బేస్డ్ పోలీసింగ్) విధానం.కేసు నిరూపణకు విశేష కృషిచేసిన తిరుపతి ఈస్ట్ పోలీసులు, పీపీ లను జిల్లా ఎస్పీ  .. కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్.,  అభినందించారు.

 

కేసు వివరాలు:

తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పీ.కే. లేఅవుట్ లో నివాసం ఉంటున్న ఎం. ధర్మయ్య S/o లేట్ మాణిక్యం, వయస్సు 57 సంవత్సరాలు గారి ఇంటి లోకి దౌర్జన్యంగా ప్రవేశించి తన ముందే కొడుకు డి.నారాయణ వయస్సు 27 సంవత్సరాలు పై పాత కక్షల కారణంగా నలుగురు దుండగులు విచక్షణ రహితంగా దాడి చేసి, హత్య చేసినట్లు 26.11.2018 వ తేదీన తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన కొడుకును కాపాడేందుకు తాను, తన పెద్ద కొడుకు మోహన్, ఇతర కుటుంబ సభ్యులు మరియు ఇరుగుపొరుగు వాళ్లు దుండగుల భారీ నుండి కాపాడేందుకు ప్రయత్నించినప్పుడు ఆ దుండగులు మాపై కూడా దాడి చేసి మమ్మల్ని కూడా బెదిరించి, కర్కషంగా తన కొడుకు అయిన డి.నారాయణ వయసు 27 సంవత్సరములు ను ఫస్ట్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్ వరకు విచక్షణ రహితంగా చేతులతో కొట్టి, కాళ్లతో తన్ని తీవ్రంగా గాయపరిచి హత్య చేసినట్లు ఫిర్యాదు చేశారు.

 

 

ఈ ఫిర్యాదు మేరకు Cr.No:348/2018 u/s 302, 450 IPC r/w 34 IPC కేసుగా నమోదు చేసి, తిరుపతి పట్టణానికి చెందిన ముగ్గురు ముద్దాయిలు A1. మురళి జై గణేష్, వయస్సు: 25 సంవత్సరాలు, S/o ఎస్.మురళి, A2. మురళి సాయి కుమార్ @ సాయి, S/o ఎస్. మురళి, A3. పి.శ్రీకాంత్ S/o పి.మురళి, మరియు కడప పట్టణానికి చెందిన ఒక ముద్దాయి A4. జే. మల్లికార్జున @ శివ, S/o జై మల్లికార్జున అను ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ చేశారు.అనంతరం కోర్టులో విచారణకు వస్తూ ఈ రోజు తుది విచారణ పూర్తి అయ్యి, నేరము నిరూపణ అవ్వడంతో నిందితులైన A1, A2, A3, A4 వారికి యావత్జీవ కఠిన కారాగార శిక్ష మరియు రూ.500/- ల జరిమానా ను విధిస్తూ, తిరుపతి 10 వ అదనపు జిల్లా కోర్టు జడ్జి శ్రీ టి.రామచంద్రుడు గారు సోమవారం నాడు తీర్పును వెలువరించారు.

 

ఇందులో భాగంగా అహర్నిశలు కృషిచేసిన దర్యాప్తు అధికారి చంద్రబాబు నాయుడు, ఈస్ట్ సీఐ మహేశ్వర రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటేశ్వర్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ , తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు కోర్టు మానిటరింగ్ సిస్టం సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ .. కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్., గారు అభినందించి, అన్ని కేసులలో కూడా ఇలానే ముందుకు వెళ్లి బాధితులకు న్యాయం చేస్తూ నేరస్తులకు శిక్ష పడేటట్లు పనిచేయాలని సూచించారు.

 

Tags:Four accused in murder case sentenced to rigorous imprisonment for life – fine.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *